ICC Rankings: వరల్డ్ కప్ కొట్టింది ఆసీస్.. కానీ ర్యాంకింగ్స్ టాప్‌లో మెరిసింది ఇండియన్ ప్లేయర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజాగా విడుదల చేసిన మహిళా టీ20 ఆటగాళ్ల ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఇటీవల ముగిసిన మహిళా టీ20 వరల్డ్ కప్ 2026లో అద్భుత ప్రదర్శన చేసిన ఆస్ట్రేలియా ఓపెనర్ బెత్ మూనీ మళ్లీ నంబర్-1 బ్యాటర్‌గా అవతరించింది. ఆమె తన కెరీర్లో ఈ ఘనత సాధించడం ఇది ఐదోసారి. వరల్డ్ కప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డును గెలుచుకున్న మూనీ, ఫైనల్లో ఇంగ్లాండ్‌పై 64 పరుగుల మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి అగ్రస్థానానికి చేరుకుంది. ఈ టోర్నమెంట్ ఫైనల్లో ఇంగ్లాండ్‌ను ఓడించి ఆస్ట్రేలియా ఏడోసారి ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
టాప్-10లో ముగ్గురు భారతీయ బ్యాటర్లు
బ్యాటింగ్ ర్యాంకింగ్స్ టాప్-10 జాబితాలో ముగ్గురు భారతీయ ఆటగాళ్లకు చోటు దక్కింది. భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఐదో స్థానంలో కొనసాగుతుండగా, షెఫాలీ వర్మ ఆరో స్థానంలో, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పదో స్థానంలో నిలిచారు. సౌతాఫ్రికాకు చెందిన లారా వోల్వార్డ్ మూడో స్థానంలో, వెస్టిండీస్ ఆల్ రౌండర్ హేలీ మాథ్యూస్ నాలుగో స్థానంలో ఉన్నారు.
Also Read
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
బౌలింగ్‌లో నంబర్-1గా భారత స్పిన్నర్ శ్రీ చరణి
బౌలింగ్ విభాగంలో భారత్‌కు చెందిన యువ స్పిన్నర్ శ్రీ చరణి సరికొత్త రికార్డు సృష్టించి T20I బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్-1 స్థానాన్ని కైవసం చేసుకుంది. వరల్డ్ కప్‌లో కేవలం ఐదు మ్యాచ్‌ల్లోనే 14 వికెట్లు పడగొట్టి టోర్నమెంట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచింది. ఐసీసీ ప్రకటించిన ‘టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్’ లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ ఆటగాడిగా ఆమె నిలిచింది. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్‌కు చెందిన సోఫీ ఎక్లెస్టోన్ రెండో స్థానంలో, చార్లీ డీన్ మూడో స్థానంలో నిలిచారు. ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో వెస్టిండీస్ ఆటగాడు హేలీ మాథ్యూస్ తన నంబర్-1 స్థానాన్ని నిలబెట్టుకుంది.
తాజావార్తలు
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!