CWC27 Ticket Ballot: టికెట్ బ్యాలెట్ ప్రక్రియకు అనూహ్య స్పందన.. 142 దేశాల నుంచి 1.50 కోట్ల దరఖాస్తులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐసీసీ పురుషుల క్రికెట్ వరల్డ్ కప్ 2027 టికెట్ల బ్యాలెట్ ప్రక్రియకు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల నుంచి ఊహించని రీతిలో భారీ స్పందన లభిస్తోంది. టికెట్ బ్యాలెట్ ప్రారంభమైన కేవలం 12 రోజుల్లోనే అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు రావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా 142 దేశాల నుంచి దాదాపు 44.23 లక్షల మంది అభిమానులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, మొత్తం 1,50,83,752 టికెట్ దరఖాస్తులు నమోదయ్యాయి. గడిచిన వారంలో ఒక మిలియన్గా ఉన్న దరఖాస్తుల సంఖ్య, కొద్ది రోజుల్లోనే కోటిన్నరకు పైగా పెరగడం ఈ టోర్నీపై ఉన్న క్రేజ్‌ను స్పష్టం చేస్తోంది.
దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ 14వ ఎడిషన్ వరల్డ్ కప్‌ను సరికొత్త ఫార్మాట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. దాదాపు 24 సంవత్సరాల విరామం తర్వాత క్రికెట్ ప్రపంచకప్ మళ్లీ ఆఫ్రికా ఖండానికి తిరిగి రావడం, ఐసీసీ చేపట్టిన ప్రచార కార్యక్రమాలు ఈ స్థాయిలో స్పందన రావడానికి కారణమని ఐసీసీ సీఈఓ సంజోగ్ గుప్తా తెలిపారు. ఈ బ్యాలెట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2026 నవంబర్ 21 రాత్రి 11:59 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. సరిగ్గా అదే రోజు నుంచి జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ మైదానంలో జరగబోయే ఫైనల్ మ్యాచ్‌కు సరిగ్గా ఒక సంవత్సరం సమయం మిగిలి ఉంటుంది.
Also Read
- Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
- Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
- AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
- UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
ఈ టికెట్ బ్యాలెట్ విధానంలో పాల్గొనడం ఉచితం.. రిజిస్ట్రేషన్ సమయంలో ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి ఒక్కో మ్యాచ్‌కు ఒక దరఖాస్తు చొప్పున, టోర్నీలోని పలు మ్యాచ్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది ‘ముందు వచ్చిన వారికి ప్రాధాన్యత’ ప్రాతిపదికన కాకుండా, పూర్తిగా పారదర్శకంగా ఉండే లాటరీ విధానంలో జరుగుతుంది. దరఖాస్తు చేసిన సమయంతో సంబంధం లేకుండా విండో తెరిచి ఉన్నంతవరకు అందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. టికెట్ల డిమాండ్ ఎక్కువగా ఉన్న మ్యాచ్‌లకు లాటరీ ద్వారా విజేతలను ఎంపిక చేసి, వారి ఈమెయిల్ ఐడీకి టికెట్లు కొనుగోలు చేసే ప్రక్రియ వివరాలను పంపుతారు. విజేతలైనా లేదా ఎంపిక కాని వారైనా, ఆ సమాచారాన్ని ఈమెయిల్ ద్వారా ఐసీసీ తెలియజేస్తుంది. ఈ చారిత్రాత్మక క్రికెట్ టోర్నీ 2027 అక్టోబర్ 2న విండ్హోక్లో ప్రారంభం కానుంది.
తాజావార్తలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
-
Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!