NTV Telugu Site icon

Womens T20 Worldcup 2024: భారీగా పెరిగిన మహిళల టి20 ప్రపంచ కప్ ప్రైజ్ మనీ..

Womens T20 Worldcup 2024

Womens T20 Worldcup 2024

Womens T20 Worldcup 2024: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) మహిళల T20 ప్రపంచ కప్ 2024 ప్రైజ్ మనీని ప్రకటించింది. ఈ ప్రకటనతో ఇప్పుడు పురుషులు, మహిళలకు సమాన ప్రైజ్ మనీ ఇవ్వబడుతుంది. వచ్చే నెలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్‌తో ఇది ప్రారంభమవుతుంది. ఐసీసీ ప్రకటన ప్రకారం.. మహిళల టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టుకు ఇకపై 2.34 మిలియన్ యూఎస్ డాలర్లు అందుతాయి. గతేడాది దక్షిణాఫ్రికాలో ఆడిన మహిళల టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న ఆస్ట్రేలియాకు 1 మిలియన్ అమెరికన్ డాలర్ల ప్రైజ్ మనీ లభించింది. ఈ విధంగా చూస్తే ప్రైజ్ మని 134 శాతం పెరిగింది. ఈ ఏడాది అమెరికా, వెస్టిండీస్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత పురుషుల జట్టు 2.34 మిలియన్ యూఎస్ డాలర్లు ప్రైజ్ మనీని అందుకుంది.

Chiranjeevi-Suhasini: గన్‌తో వాళ్లను బెదిరించారు.. రియల్‌ లైఫ్‌లో కూడా చిరంజీవి హీరోనే: సుహాసిని

ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ 2024 మొదటి ఐసీసీ టోర్నమెంట్ అని తెలిపింది. దీనిలో స్త్రీలు పురుషులతో సమానంగా ప్రైజ్ మనీ పొందుతారు. ఇది ఈ క్రీడ చరిత్రలో ఒక ముఖ్యమైన విజయం అవుతుంది. ప్రకటన ప్రకారం, జూలై 2023లో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోబడింది. 2030 షెడ్యూల్ కంటే ఏడేళ్ల ముందే ప్రైజ్ మనీని సమం చేయాలని ఐసీసీ బోర్డు నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ కప్‌లో పురుషులు, మహిళలకు సమాన ప్రైజ్ మనీని కలిగి ఉన్న మొదటి ప్రధాన క్రీడగా క్రికెట్ అవతరించింది.

Kolkata Doctor Rape Case: ట్రైనీ డాక్టర్ కేసులో మాజీ ప్రిన్సిపాల్, పోలీస్ అధికారికి సీబీఐ కస్టడీ పొడిగింపు

మహిళల టీ20 ప్రపంచకప్ అక్టోబర్ 3 నుంచి యూఏఈలో జరగనుంది. ముందుగా బంగ్లాదేశ్‌లో నిర్వహించాల్సి ఉంది. అయితే అక్కడి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు మార్చింది. అక్టోబర్ 4న న్యూజిలాండ్‌తో మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది.

Show comments