Site icon NTV Telugu

IBOMMA Ravi: సాఫ్ట్వేర్ ఇంజనీర్.. ఓ కంపెనీకి CEO.. పైరసీ కింగ్ పిన్‌గా మారిన రవి కథ..

I Bomma

I Bomma

IBOMMA Ravi: పైరసీ కింగ్ పిన్‌గా మారిన ఐ బొమ్మ రవి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇమ్మడి రవి నేదర్ల్యాండ్స్, కరేబియన్ దీవులకు వెళ్ళే ముందు హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ కంపెనీని నెలకొల్పాడు. వెబ్ డిజైన్ సర్వీస్ ఇస్తామని సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించాడు. ER infotech అనే సాఫ్ట్వేర్ కంపెనీకు CEOగా ఉన్నాడు. ముంబై యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశాడు. తన చదువు, జ్ఞానాన్ని ఉపయోగించి తెలుగు ఇండస్ట్రీని బురిడి కొట్టించాడు. గత కొన్ని సంవత్సరాలుగా పెద్ద ఎత్తున సినిమాలను పైరసీ చేసిన రవి.. భారీగా ఆదాయం పొందాడు. సినిమా ఇండస్ట్రీకి మాత్రం దాదాపు రూ.3 వేల కోట్ల నష్టాన్ని తీసుకొచ్చాడు. ఇటీవల సినిమా పైరసీలపై సైబర్ క్రైమ్ ఉక్కు పాదం మోపుతూ వస్తోంది.

READ MORE: Ambulance In Track: రోడ్డుపై వెళ్లాల్సిన అంబులెన్స్ పట్టాలెక్కింది.. షాక్ లో నెటిజన్లు

ఈ క్రమంలోనే మూవీ పైరసీ తిమింగలం కోసం పోలీసులు కాపు కాస్తూ ఉండగా నిన్న(శనివారం) అదుపులోకి తీసుకున్నారు. ఇక రవికి గత కొంతకాలంగా తన భార్యతో విభేదాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విభేదాలు కారణంగా విదేశాలలో ఉన్న ఈయన తన భార్య నుంచి విడాకులు తీసుకోవడం కోసం ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఈయన హైదరాబాద్ వస్తున్నట్టు సమాచారాన్ని సైబర్ క్రైమ్ పోలీసులకు స్వయంగా సమాచారాన్ని రవి భార్య అందవేసినట్టు తెలుస్తుంది. దీంతో పోలీసులు రవిని అరెస్ట్ చేశారు. అంతే కాదు.. పోలీసులు విచారణలో భాగంగా రవి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్టు తెలుస్తుంది.

READ MORE: Vangaveeti Family: ఆసక్తికరంగా వంగవీటి ఫ్యామిలీ రాజకీయాలు.. రాధా లేని టైంలో ఆశా కిరణ్ పొలిటికల్ ఎంట్రీ!

Exit mobile version