Site icon NTV Telugu

Ravi: సామాన్యుడు కాడు..! IBomma పేరుతో 70కి పైగా మిర్రర్ సైట్లు.. వెలుగులోకి సంచలన విషయాలు..

Ravi

Ravi

Ravi: ఐ బొమ్మ ఇమ్మడి రవి గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కూకట్‌పల్లిలోని రవి అపార్ట్మెంట్‌లో పోలీసులు సోదాలు నిర్వహించారు.. రూ. 3 కోట్ల నగదు, వందల కొద్ది హార్డ్ డిస్క్‌లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు.. వైజాగ్‌కి చెందిన రవి టెక్నికల్ ఎక్స్పర్ట్ గా గుర్తించారు.. ప్రపంచంలో ఎలాంటి సర్వర్ ఐనా, ఎంత సెక్యూర్‌గా ఉంచినా ఈజీగా హ్యాక్ చేయగలిగే ట్యాలెంట్ ఉంది. కొత్త సినిమాలు భద్రపరిచే క్లౌడ్ ఫ్లేర్‌ను సైతం హ్యాక్ చేశాడు. కొత్త సినిమాలను డౌన్లోడ్ చేసి కరేబియన్ దీవులు అడ్డగా చేసుకుని i-bomma website లో అప్లోడ్ చేశాడు. IBomma పేరుతో 70 కి పైగా మిర్రర్ సైట్లు నిర్వహిస్తున్నాడు.. IBomma, bappam, IRadha పేర్లతో ప్రధాన వెబ్సైట్లు ఉన్నాయి..

READ MORE: Varanasi Event : కార్తికేయ ఎమోషనల్ స్పీచ్.. కంటతడి పెట్టిన రమా రాజమౌళి!

రవికి దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఉంది.. నిర్మాతలు విడుదలకి సిద్ధంగా ఉన్న సినిమాలను కొన్ని డిజిటల్ మీడియా సంస్థలకు అందిస్తున్నాయి. విడుదల కోసం ఆయా సంస్థలు థియేటర్లకు సాటిలైట్ ద్వారా చేరవేస్తున్నాయి. వీటిని రవి హ్యాక్ చేస్తున్నాడు. వైజాగ్‌లోని MVP కాలనీ సెక్టార్ 7 లోని నివాసం నుంచి కూడా కార్యకలాపాలు జరిపాడు. తనను ఎవరూ గుర్తించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. సెప్టెంబర్ 29న పైరసీ ముఠాకి చెందిన తన అనుచరులు శివాజీ, ప్రశాంత్ అరెస్ట్‌తో అజ్ఞాతంలోకి వెళ్లాడు. అప్పటి వరకు హైదరాబాద్‌లోనే ఉన్న అతడు పరారయ్యాడు.. అక్టోబర్ 3న నెదర్లాండ్‌లోని ఆమ్స్టడార్‌కి, అక్కడి నుంచి ఫ్రాన్స్, కరేబియన్ దీవులు.. ఇలా పలు దేశాల్లో ఉంటూ IP అడ్రస్‌లు మార్చుతూ కార్యకలాపాలు సాగించాడు.. భార్యతో విడాకుల ప్రాసెస్ కోసం నెదర్లాండ్స్ నుంచి హైదరాబాద్‌కి వచ్చాడు. ఈ విషయాన్ని అతడి భార్య పోలీసులకు తెలిపింది.

Exit mobile version