Site icon NTV Telugu

CS Neerabh Kumar Prasad: బాధ్యతలు స్వీకరించిన కొత్త సీఎస్‌.. రాష్ట్రాన్ని ముందంజలో నిలిపేందుకు కృషి

Cs Neerabh Kumar Prasad

Cs Neerabh Kumar Prasad

CS Neerabh Kumar Prasad: ఆంధ్రప్రదేశ్‌ నూతన సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించారు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నీరభ్‌ కుమార్ ప్రసాద్. ఈ సందర్భంగా కొత్త సీఎస్‌ను ఆశీర్వదించారు టీటీడీ, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం వేద పండితులు. ఇక, కొత్త సీఎస్ కు శుభాకాంక్షలు తెలిపారు వివిధ శాఖల అధికారులు… ఈ సందర్భంగా సీఎస్‌ నీరభ్‌ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ.. సీఎస్ గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయను నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.. సహచర అధికారులు సిబ్బందితో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు నా వంతు కృషి చేస్తానని వెల్లడించారు.. ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా తన పని ఉంటుంది.. మంచి చేసేలా కృషి చేస్తాను అన్నారు.. అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా అమలుకు కృషి చేస్తాను అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేందుకు శాయశక్తులా కృషి చేస్తాను అన్నారు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌.

Read Also: OG : భారీ ధరకు సేల్ అయిన ‘ఓజి’ ఓటీటీ రైట్స్..?

కాగా, ఏపీ కేడర్‌కు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ ను సీఎస్‌గా నియమించింది ప్రభుత్వం.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.. ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డిని బదిలీ చేసినట్టు పేర్కొంది ప్రభుత్వం.. 1987 బ్యాచ్‌కు చెందిన నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌.. ప్రస్తుతం ఏపీ పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతికశాఖ స్పెషల్‌ సీఎస్‌గా పనిచేస్తుండగా.. ఆయన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.. అయితే, తన ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహణ జవహర్ రెడ్డి చేతుల మీద జరపడానికి చంద్రబాబు విముఖతతో ఉన్నారని.. అందుకే ఈ పరిణామం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది.. మరోవైపు.. జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లినా.. తాజా ఉత్తర్వుల్లో బదిలీ చేస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది..

Exit mobile version