NTV Telugu Site icon

Ravindra Jadeja: రోజూ 12 గంటలు బౌలింగ్ చేసేవాడిని: జడేజా

H

H

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ అదరగొడుతోంది. తొలి రోజు పూర్తిగా ప్రత్యర్థి జట్టుపై టీమిండియా పైచేయి సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కంగూరూ జట్టును 177 రన్స్‌కే ఆలౌట్ చేయడంలో స్పిన్నర్లది కీలకపాత్ర. ఇందులో గాయం కారణంగా కొన్ని నెలలు క్రికెట్‌కు దూరంగా ఉన్న రవీంద్ర జడేజా పాత్రనే అధికం. ఎందుకంటే రీఎంట్రీ తర్వాత జడ్డూకు ఇది తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్. అయినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా తనదైన మార్క్ బౌలింగ్‌తో ఐదు వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాసించాడు. దీంతో జడేజాపై ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జడ్డూ మాట్లాడుతూ పునరాగమనం కోసం రోజూ 10-12 గంటలు బౌలింగ్ చేసేవాడినని చెప్పుకొచ్చాడు.

Also Read: Google Maps: సూపర్ ఫీచర్స్‌తో గూగుల్ మ్యాప్స్‌..ఉన్నచోటు నుంచే!

“ఐదు నెలల తర్వాత టెస్ట్ క్రికెట్ ఆడుతున్నా. ఇది చాలా కష్టం. దాని కోసం నేను సిద్ధమయ్యా. చాలా కఠినంగా శ్రమించాను. ఎన్‌సీఏలో నా ‌ఫిట్‌నెస్‌తో పాటు నా నైపుణ్యాలనూ మెరుగుపరచుకున్నా. చాలా రోజుల తర్వాత ఓ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాను. అక్కడ 42 ఓవర్లు వేశాను. ఈ టెస్ట్ మ్యాచ్‌లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగడానికి ఇది ఎంతగానో సాయపడింది. బెంగళూరు ఎన్‌సీఏలో ఉన్నప్పుడు నా బౌలింగ్‌పై చాలా కఠినంగా శ్రమించా. ప్రతి రోజూ 10 నుంచి 12 గంటలు బౌలింగ్ చేసేవాడిని. అది నాకెంతో సాయపడింది. నాగ్‌పూర్ వికెట్‌పై అసలు బౌన్సే లేదు. స్టంప్ టు స్టంప్ లైన్ వేశాను. ఓ బాల్ స్పిన్ అవుతోంది.. ఓ బాల్ నేరుగా వెళ్తోంది. లెఫ్టామ్ స్పిన్నర్‌గా ఓ బ్యాటర్ వికెట్ల వెనుక క్యాచ్ ఇచ్చినా, స్టంపౌట్ అయినా ఆ క్రెడిట్ బాల్‌కే దక్కుతుంది. టెస్ట్ క్రికెట్‌లో ఏ వికెట్ దక్కినా అది సంతోషమే” అని జడేజా అన్నాడు.

Also Read: Gita GPT: భగవద్గీత స్ఫూర్తితో చాట్‌బాట్..ఏ డౌట్‌ ఉన్నా చెప్పేస్తుంది!