Site icon NTV Telugu

Simran : ఆయన లేని నా సినీ ప్రయాణం ఉహించుకోలేను.. నటి సిమ్రాన్ ఎమోషనల్ పోస్ట్..

Whatsapp Image 2023 12 08 At 7.33.08 Pm

Whatsapp Image 2023 12 08 At 7.33.08 Pm

సీనియర్ స్టార్ హీరోయిన్ నటి సిమ్రాన్..గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు..ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌ గా ఓ వెలుగు వెలిగింది. ఈ భామ తెలుగు లో బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరో ల అందరి సరసన హీరోయిన్ గా నటించి మెప్పించింది.ప్రస్తుతం సిమ్రాన్ సినిమాలకు కాస్త దూరంగా ఉంటోంది. అప్పుడప్పుడు సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించి మెప్పిస్తోంది. ఈ నటి ఎక్కువగా బాలీవుడ్‌ చిత్రాల్లోనే నటిస్తోంది. అయినప్పటికీ సోషల్‌ మీడియా లో తన తెలుగు అభిమానులకూ ఎప్పుడు టచ్‌లోనే ఉంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సిమ్రాన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ లో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టింది.

సిమ్రాన్‌ మేనేజర్‌ ఎం.కామరాజన్‌ అనారోగ్యంతో మరణించారు. సిమ్రాన్ వద్ద దాదాపు 25 ఏళ్లుగా మేనేజర్ గా పనిచేసిన ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్తను సిమ్రాన్‌ సోషల్‌ మీడియా ద్వారా తన అభిమానుల తో పంచుకుంది. ఆయన లేకుండా తన సినీ ప్రయాణాన్ని ఊహించుకోలేనంటూ ఎంతో భావోద్వేగకరమైన పోస్ట్‌ పెట్టింది.’నమ్మలేకపోతున్నా. దిగ్భ్రాంతికరమైన వార్త. నా ప్రియమైన స్నేహితుడు ఎం. కామరాజన్ ఇక లేరు. 25 ఏళ్లు గా ఆయన నా కుడి భుజం గా ఉన్నారు. నా ఎదుగుదలకు ఆయన ఓ పిల్లర్‌లా నిలబడ్డారు.అయన ఎంతో చురుకైన వ్యక్తి. ఎప్పుడూ నవ్వుతూ అందరి తో ఎంతో మర్యాదపూర్వకం గా వ్యవహరించేవారు.ఎంతో నమ్మకంగా పని చేసేవారు.కామరాజన్ ఎంతో మందికి మీరు ఆదర్శంగా నిలిచారు. మీరు లేకుండా నా సినీ ప్రయాణాన్ని ఊహించుకోలేను. మిమ్మల్ని ఎంతగానో మిస్ అవుతాం. చాలా త్వరగా వెళ్లిపోయారు. మీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం నటి పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు కామరాజన్‌ మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు.

https://www.instagram.com/p/C0jBdIQrJxm/?igshid=MzRlODBiNWFlZ

Exit mobile version