Every 5 minutes One Hyundai Creta is sold in India: భారత ఆటో మార్కెట్‌లో కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌ను ‘హ్యుందాయ్ క్రెటా’ శాసిస్తోంది. కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగానికి క్రెటా ‘కింగ్’ అని కూడా చెప్పొచ్చు. లగ్జరీ లుకింగ్, మైలేజ్, సేఫ్టీ లాంటి ప్రయోజనాలు ఉండటంతో జనాలు ఎక్కువగా క్రెటాను కొనుగోలు చేస్తున్నారు. ఎనిమిదేళ్ల క్రితం భారత మార్కెట్‌లోకి వచ్చిన క్రెటాకు ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. దాంతో హ్యుందాయ్ ఇండియా కొత్త మైలురాయిని అందుకుంది.
2015 నుంచి ఇప్పటివరకు 10 లక్షల యూనిట్ల క్రెటా వాహనాలను హ్యుందాయ్ విక్రయించింది. అంటే.. ప్రతి 5 నిమిషాలకు ఒక క్రెటా అమ్ముడయింది. క్రెటా విక్రయాలతో హ్యుందాయ్ ఇండియా చాలా సంతోషంగా ఉంది. ఇదే జోష్‌లో కంపెనీ ఇటీవల అప్‌డేటేడ్ వెర్షన్‌ను విడుదల చేసింది. క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఏడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. రూ.11 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో ఈ మోడల్ అందుబాటులో ఉంది.
Also Read: Nikhil Siddhartha: తండ్రైన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్.. ఫోటో వైరల్!
హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ కోసం ఇప్పటివరకు ఏకంగా 60 వేలకు పైగా బుకింగ్‌లు వచ్చాయి. ఈ కారు కొనాలంటే గరిష్ఠంగా ఏడు నెలలు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటివరకు 2.80 లక్షల యూనిట్లను ఇతర దేశాలకు కూడా కంపెనీ ఎగుమతి చేసింది. ఇక కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టాటా హారియర్, మహీంద్రా స్కార్పియో-ఎన్, టయోటా అర్బన్ క్రూజర్, వోక్స్‌వ్యాగన్ టైగూన్‌లు క్రెటాకు గట్టి పోటీనిస్తున్నాయి.