NTV Telugu Site icon

Hyundai Creta N Line Price: భారత మార్కెట్‌లోకి ‘హ్యుందాయ్‌ క్రెటా ఎన్‌లైన్’.. ధర, బుకింగ్ డీటెయిల్స్ ఇవే!

Hyundai Creta N Line Price

Hyundai Creta N Line Price

Hyundai Creta N Line 2024 Launch and Price: ప్రస్తుతం భారత ఆటో మార్కెట్‌ను ‘హ్యుందాయ్ క్రెటా’ శాసిస్తోంది. లగ్జరీ లుకింగ్‌, బెస్ట్ మైలేజ్, సూపర్ సేఫ్టీ లాంటి ప్రయోజనాలు ఉండటంతో.. ఎక్కువ మంది క్రెటాను కొనుగోలు చేస్తున్నారు. ఎనిమిదేళ్ల క్రితం భారత మార్కెట్‌లోకి వచ్చిన క్రెటాకు ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఎన్ని మోడల్స్ రిలీజ్ అయినా.. అమ్మకాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ‘హ్యుండాయ్ మోటార్ ఇండియా’ తన ఎస్‌యూవీ ‘క్రెటా ఎన్‌లైన్’ మోడల్‌ను సోమవారం భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించింది.

హ్యుందాయ్‌ క్రెటా ఎన్‌లైన్ కారు ధర రూ.16.82 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఎన్‌లైన్ (ఎన్8, ఎన్10) వేరియంట్ కార్లు మాన్యువల్ ట్రాన్స్ మిషన్, ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లలో అనుదుబాటులో ఉంటాయి. ఎన్8 వేరియంట్ ధరలు రూ.16.82 లక్షల నుంచి రూ.18.32 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉన్నాయి. టాప్ ఎండ్ ఎన్10 వేరియంట్ ధర రూ.19.34 లక్షల నుంచి రూ.20.30 లక్షలు (ఎక్స్ షోరూమ్) ఉన్నాయి. క్రెటా ఎన్‌లైన్ కారు వన్ ఇంజిన్, రెండు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో లభిస్తుంది.

హ్యుందాయ్‌ క్రెటా ఎన్‌లైన్ ఆరు కలర్లలో లభిస్తుంది. అట్లాస్ వైట్, అబ్యాస్ బ్లాక్, టైటాన్ గ్రే మ్యాట్టె, థండర్ బ్లూ విత్ అబ్యాస్ బ్లాక్ రూఫ్, షాడో గ్రే విత్ అబ్యాస్ బ్లాక్ రూఫ్, అట్లాస్ వైట్ విత్ అబ్యాస్ బ్లాక్ రూఫ్ ఆప్షన్లలో ఈ కారు ఉంటుంది. ఫిబ్రవరి నెలలోనే క్రెటా ఎన్‌లైన్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. హ్యుండాయ్ సిగ్నేచర్ డీలర్ షిప్స్, ఆన్ లైన్ ప్లాట్ ఫామ్స్ ద్వారా రూ.25 వేల టోకెన్ అమౌట్ పే చేసి.. ఈ కారుని బుక్ చేసుకోవచ్చు.

Also Read: Road Accident: పెళ్లి ఊరేగింపుపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఐదుగురు మృతి! 11 మందికి గాయాలు

క్రెటా ఎన్‌లైన్ 1.5 లీటర్ల ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. స్టాండర్డ్ వర్షన్ కారు ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ డ్యుయల్ క్లచ్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లతో రానుంది. కారు ఇంజిన్ గరిష్టంగా 153 బీహెచ్‌పీ విద్యుత్, 253 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. ఈ కారు 9 సెకన్లలోనే 100 కిమీ వేగం అందుకుంటుంది. ఇది ఎకో, నార్మల్, స్పోర్ట్ మోడ్స్ సహా మంచు, ఇసుక, బురద మోడ్స్ లో లభిస్తాయి. 10.25 ఇంచెస్ టచ్ స్క్రీన్ డిస్ ప్లే, డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, వైర్ లెస్ చార్జర్, పనోరమిక్ సన్ రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, డ్యుయల్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ డ్రైవర్ సీట్, 2-అడాస్ టెక్నాలజీ, 360-డిగ్రీ కెమెరా, సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ తదితర ఫీచర్లు ఈ కారులో ఉంటాయి.