NTV Telugu Site icon

Viral Video : నడి రోడ్డు పై ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయిన జంట.. ఇదేం ఖర్మ సామి..

Hyd

Hyd

ఈ మధ్య లవర్స్ పబ్లిసిటీ కోసం చేస్తున్నారో.. థ్రిల్ కోసం చేస్తున్నారో తెలియడం లేదు కానీ నడి రోడ్డు పై జనాలు చూస్తారు అనే బుద్ది కూడా లేకుండా రొమాన్స్ చేస్తున్నారు.. మొన్నటివరకు మెట్రోలో ఘాటు రొమాన్స్ చేసిన లవర్స్ ఇప్పుడు రూటు మార్చారు.. ఇప్పుడు నడిరోడ్డుపై బైకు మీదొ, కారు మీదో చేస్తున్నారు.. ఆ వీడియోలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో మనం చూస్తూనే ఉన్నాం.. తాజాగా అలాంటి వీడియోనే వైరల్ అవుతుంది..

హైదరాబాద్‌లో కదులుతున్న కారు పైకప్పుపై యువ జంట కూర్చుని ముద్దులు పెట్టుకున్న వీడియో నెటిజన్ల స్పందనను రేకెత్తిస్తోంది. ట్విట్టర్లో X షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియా యూజర్ల నుండి మిశ్రమ స్పందనలకు దారితీసింది.. హైదరాబాద్‌లో బహిరంగంగా ఇలా ముద్దులు దర్శించడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు ఇలాంటి ఫిర్యాదుల కారణంగా హైదరాబాద్‌లోని పౌర సంస్థ అవివాహిత జంటలను ఇందిరా పార్క్‌లోకి ప్రవేశించకుండా పరిమితం చేసింది. కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ మెట్రో స్టేషన్‌లో లిఫ్ట్‌లలో ముద్దులు పెట్టుకుంటూ జంటలు పట్టుబడ్డారు. లిఫ్ట్‌లలోని కెమెరాల గురించి వారికి తెలియక ఈ పనిచేసినప్పటికీ, ఇలాంటి వీడియోలు ప్రజల ఆగ్రహాన్ని కారణమైంది..

ఇక ఇప్పుడు తాజాగా ఇలా జరగడం పై పెదవిరుస్తున్నారు.. హైదరాబాద్‌లో కారు పైకప్పుపై ముద్దులు పెట్టుకున్న ఈ జంట వీడియో ఎప్పుడు తీశారో అస్పష్టంగా ఉంది, వైరల్ వీడియో ఆధారంగా హైదరాబాద్ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.. ఏది ఏమైనా ఈ వీడియో మాత్రం నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది..

Show comments