Site icon NTV Telugu

Hyderabad: విషాదం.. ప్రముఖ యూట్యూబర్ కోమలి ఆత్మహత్య.. అతడే కారణమా?

Komali

Komali

Hyderabad: హైదరాబాద్ రాయదుర్గం పరిధిలో ప్రముఖ యూట్యూబర్ కోమలి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మణికొండ చిత్రపురి కాలనీలో తన మామ ఇంట్లో ఉంటోంది. మల్లారెడ్డి యూనివర్సిటీలో BSC చదువుతు.. పార్ట్ టైమ్‌లో యూట్యూబ్ వీడియోలు చేస్తుంది. మూడేళ్లుగా మరో యుట్యూబర్‌తో ప్రేమలో ఉంది కోమలి. ఆ యూట్యూబర్‌ పేరు అఖిల్ రెడ్డిగా చెబుతున్నారు. అఖిల్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ.. యూట్యూబర్‌లో వీడియోలు చేస్తున్నాడు. ఇద్దరి మధ్య విభేదాలతో ఏడాది క్రితం బ్రేకప్ అయ్యింది. ఈ నేపథ్యంలో కొన్ని నెలల క్రితం కూడా కోమలి ఆత్మహత్యకి యత్నించింది. తాజాగా మరోసారి సూసైడ్ చేసుకుంది. కాగా.. తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఉండేలా చూడాలని మొక్కుతూ తిరుమల కాలినడకన వెళ్ళింది కోమలి. ప్రతీ మెట్టుకు బొట్టు పెడుతూ ఎక్కుతూ.. వీడియో పోస్ట్ చేసింది. ఇదే తన చివరి వీడియో! ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. కోమలి సూసైడ్‌కి గల పూర్తి కారణాలు తేలియాల్సి ఉంది.

READ MORE: Pradeep Ranganathan : ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన ప్రదీప్ రంగనాథన్.. ఆ బ్యూటీతో తొలి ప్రాజెక్ట్!

Exit mobile version