Hyderabad: గాంధీనగర్‌లో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. సికింద్రాబాద్ ప్రాంతం కవాడిగూడలో నివాసం ఉంటున్న రాజేష్ (19) అనే యువకుడు ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇష్టం లేని ఉద్యోగానికి వెళ్లాలని తల్లిదండ్రులు ఒత్తిడి చేయడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. గత వారం రోజుల క్రితమే హిమాయత్‌నగర్‌లో ప్రైవేట్ కాల్ సెంటర్లో ఉద్యోగానికి చేరాడు రాజేష్. కాల్ సెంటర్‌లో జాబ్ చేయడం ఇష్టం లేదని చెప్పాడు. జాబ్ చేయాలని కుటుంబ సభ్యులు తీవ్ర ఒత్తిడికి గురి చేసినట్లు తెలిపారు. తన ఆత్మహత్య కారణాలపై ఇన్ స్టాగ్రామ్ లో వీడియో పోస్ట్‌చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు.
READ MORE: Delhi gangster suicide: ఢిల్లీ జైలులో గ్యాంగ్‌స్టర్ సూసైడ్.. జైలు నంబర్ 15లో ఏం జరిగింది?
కాగా.. కుటుంబ కలహాలు, ఆర్థిక కారణాలు, జీవితంపై విరక్తి, ప్రేమ విఫలం, మత్తు పదార్థాలకు బానిస కావడం.. ఇలా చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలకు పాల్పడే వారు ఎందరో. ఇటీవల ఎక్కువగా యుక్త వయసులో ఉన్నవారే ఆత్మహత్యలకు పాల్పడ్డారు. నిద్రలేమి, ప్రవర్తనలో మార్పు వల్ల యువత ఎక్కువగా డిప్రెషన్‌లోకి వెళ్తున్నారని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాంటి వారిని గుర్తిస్తే.. బలవన్మరణాలను నివారించడానికి వీలుంటుందని తెలిపారు.
READ MORE: PM మోదీ :దివాళీ నాటికి జీఎస్టీ రేట్లు తగ్గించి ప్రజల ఆనందాన్ని రెట్టింపు చేస్తాం !
