Site icon NTV Telugu

Hyderabad: పోలీస్ శాఖకే మచ్చతెచ్చిన ఎస్సై.. బెట్టింగ్‌ కోసం ఏకంగా తుపాకీ తాకట్టు..!

Adilabad Guns

Adilabad Guns

Hyderabad: హైదరాబాద్ పోలీస్‌ శాఖకు మచ్చతెచ్చే విధంగా అంబర్‌పేట్ పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్ఐ భాను ప్రకాశ్ ప్రవర్తించిన తీరు పెద్ద వివాదంగా మారింది. బెట్టింగ్‌లలో బాగా మునిగిపోయి అప్పుల పాలైన భాను ప్రకాశ్, ఆర్థిక ఇబ్బందులు తీర్చుకునేందుకు చట్టవిరుద్ధ మార్గాలు ఎంచుకున్నట్టు బయటపడింది. ఓ రికవరీ కేసులో స్వాధీనం చేసిన ఐదు తులాల బంగారాన్ని తన సొంత ప్రయోజనాలకు వాడుకుని పోలీస్ వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీశాడు. బాధ్యతగా పని చేయాల్సిన స్థానంలో ఉండి నేరాలకు పాల్పడటంతో భాను ప్రకాశ్‌పై పోలీసు శాఖలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

READ MORE: Winter Health Tips: రోజు రోజుకూ పెరుగుతున్న చలి.. జర భద్రం గురూ..

అంతేకాదు.. ఎస్సై గన్ మిస్ అయినట్లుగా తోటి సిబ్బంది, ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ అంశంపై ఉన్నతాధికారులు నిలదీశారు. కానీ.. ఎస్సై భాను ప్రకాశ్‌ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. అయితే, బంగారంతో పాటు తుపాకీని కూడా ఓ బ్రోకర్ వద్ద తాకట్టు పెట్టినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులతోనే విధి నిర్వహణలో వాడే గన్‌ను తాకట్టుపెట్టినట్లు సమచారం. ప్రస్తుతం ఎస్సై భాను ప్రకాశ్ టాస్క్ఫోర్స్ పోలీసుల అదుపులో ఉన్నాడు. అతడిని పోలీసులు విచారిస్తున్నారు.

READ MORE:OnePlus 15R Launch: 8000mAh బ్యాటరీ, 50MP కెమెరా.. స్పెషల్ స్పెసిఫికేషన్లతో వస్తున్న వన్‌ప్లస్‌ 15ఆర్!

Exit mobile version