Site icon NTV Telugu

Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. గంజాయి మత్తులో 8 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం..

Rape

Rape

Hyderabad: హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. గంజాయి మత్తులో ఓ దుండగుడు 8 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దంపతులు హైదరాబాద్–సైదాబాద్ పరిధిలోని సింగరేణి కాలనీలో కూతురు(8), కుమారుడు(7) లతో నివసిస్తూ, కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. దంపతులిద్దరు కూలీ పనులకు వెళ్లిన సమయంలో ఇద్దరు చిన్నారులను ఇంటికి పిలిచాడు ఓ యువకుడు. సోదరుడి ముందే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. బాలిక అనారోగ్యానికి గురవ్వగా, తల్లిదండ్రులు చిన్నారి తమ్ముడిని నిలదీశారు. దీంతో ఆ బాలుడు జరిగిన విషయాన్ని చెప్పాడు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సహాయంతో సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

READ MORE: Minister Satya Kumar Yadav: ప్రపంచమంతా మళ్లీ భారతీయ వైద్య విధానం వైపు..

Exit mobile version