Site icon NTV Telugu

Real Estate Company: రెచ్చిపోయిన రియల్ ఎస్టేట్ సంస్థ.. అర్ధరాత్రి బౌన్సర్లతో యజమానులపై దాడి!

Real Estate Company

Real Estate Company

హైదరాబాద్ నగర శివార్లలో రియల్టీ బిజినెస్‌ ఇటీవలి రోజుల్లో కాస్త ఊపందుకుంది. దాంతో ఓవైపు నయా గ్యాంగ్‌లు రెచ్చిపోతుంటే.. మరోవైపు రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా దౌర్జన్యాలకు పాల్పడుతున్నాయి. పక్కా రిజిస్ట్రేషన్ భూములపై కన్నేసి.. అడ్డొచ్చిన యజమానులపై దాడిపై పాల్పడుతున్నాయి. తాజాగా పుప్పాలగూడలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. గత అర్ధరాత్రి ఓ రియల్ ఎస్టేట్ సంస్థ పట్టా పొలం కబ్జా చేసింది.

Also Read: Oppo Reno 15 Launch: జనవరి 8న మూడు ‘ఒప్పో’ ఫోన్‌లు లాంచ్.. స్పెక్స్, ధర డీటెయిల్స్ ఇవే!

ఓ రియల్ ఎస్టేట్ సంస్థ అర్ధరాత్రి పుప్పాలగూడలోని సర్వే నెంబర్ 300లోకి ప్రవేశించి దౌర్జన్యంగా బోర్డుల తొలగించింది. జేసీబీలతో ప్రహారీ గోడ ధ్వంసం చేసింది. బౌన్సర్ల సాయంతో పట్టా పొలంను కబ్జా చేసింది. యజమానులు విషయం తెలుసుకుని పొలం దగ్గరికి చేరుకుని ప్రశ్నించగా.. బౌన్సర్లు వారిపై దాడి చేశారు. బాధితులు 100కి కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులను చూసి బౌన్సర్లు పరారయ్యారు. కోర్టులో కేసులు పెండింగ్లో ఉండగానే రియల్ ఎస్టేట్ సంస్థ ఇలా బరితెగించడంపై యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

Exit mobile version