NTV Telugu Site icon

Hyderabad: రేపిస్ట్ నుంచి ఆరేళ్ల బాలికను సేవ్ చేసిన ర్యాపిడో డ్రైవర్

Rapist

Rapist

హైదరాబాద్ లో ఓ ర్యాపిడో డ్రైవర్ సకాలంలో స్పందించడం వల్ల ఆరేళ్ల జీవితాన్ని రక్షించింది. మరికాసేపట్లో రేపిస్ట్ చేతిలో నలిగిపోయే పసి కూనను ఆ ర్యాపిడో డ్రైవర్ కాపాడాడు. ఆ పాపకు తాను తండ్రినంటూ దుండగుడు బుకాయించే ప్రయత్నం చేయగా.. అతన్ని బెదిరించి పోలీసులకు ఫోన్ చేసి పాపను కాపాడాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఇర్రంమంజిల్ మెట్రో స్టేషన్ దగ్గర జరిగింది.

Also Read : Tamil Nadu: శభాష్ నందిని.. ప్లస్ టూలో 600/600 మార్కులు.. సీఎం అభినందనలు

26 ఏళ్ల కారంతోట్ కళ్యాణ్ ఏపీలోని నంద్యాల్‌కు చెందిన మెకానికల్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా మారాలని హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకుంటున్నాడు. ర్యాపిడో డ్రైవర్‌గా పార్ట్ టైమ్‌ జాబ్ చేస్తున్నాడు. ఓ ప్రయాణికుడు ఆర్డర్ చేయగా.. ఇర్రం మంజిల్ మెట్రో స్టేషన్ దగ్గరకు వెళ్లి ప్రయాణికుడి కోసం కళ్యాణ్ వెయిట్ చేయగా.. ఆ టైంలో మెట్రో స్టేషన్ దగ్గర చీకటిలో నుంచి చిన్న పాప అరుపులు ఆయనకు వినిపించాయి.

Also Read : Jagannaku Chebudam: పొలిటికల్‌ డ్రామా..! టీడీపీ స్టంట్ బ్యాక్ ఫైర్ అంటున్న వైసీపీ..!

అటు వైపుగా వెళ్లిన కల్యాణ్ కు.. 19 ఏళ్ల దుండగుడు ఆరేళ్ల బాలిక పైకి లాగేసుకుంటున్నాట్లు కనిపించింది. దీంతో అతన్ని నిలదీయగా.. ఆ ఆగంతుకుడు బాలికకు తాను తండ్రి అని చెప్పాడు. కానీ, నమ్మశక్యంగా లేకపోవడంతో ఇంతలో బాలిక అతను తన తండ్రి కాదని చెప్పింది. తన తండ్రి మరణించాడని, తల్లితో ఉంటున్నట్లు సదరు బాలిక వెల్లడించింది. దీంతో ఆ బాలిక పేరేమిటని దుండుగుడిని అడిగా, ఆ తర్వాత బాలికను అడిగాను. ఇద్దరు చెప్పిన పేర్లే వేర్వేరుగా ఉండటంతో పోలీసులకు ఫోన్ చేసినట్లు కళ్యాణ్ చెప్పాడు.

Also Read : Sports Festival : హైదరాబాద్ లో స్పోర్ట్స్ ఫెస్టివల్.. దేశ వ్యాప్తంగా ఖేలో భారత్ ప్రోగ్రాం..

అక్కడకు వచ్చిన పంజాగుట్ట పోలీసులు ఆ యువకుడిని అరెస్టు చేశారు. ఆ యువకుడు పండ్లు అమ్ముకునే అఫ్రోజ్‌గా పోలీసులు గుర్తించారు. బాలికను కూడా స్టేషన్‌కు తీసుకెళ్లారు. రెండు గంటల పాటు బాలిక కోసం వెతుకుతున్న కుటుంబ సభ్యులు పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కు రావడంతో సురక్షితంగా తల్లికి పోలీసులు అప్పగించారు. ర్యాపిడో డ్రైవర్ కళ్యాణ్ ను విమెన్ సేఫ్టీ, అదనపు డీజీపీ శిఖా గోయల్ అభినందించారు. యువతకు ఆయన ఆదర్శంగా నిలిచారని, ఎక్కడైనా నేరం జరుగుతున్నట్టు అనుమానిస్తే వెంటనే పోలీసులకు ఫోన్ చేసి అలర్ట్ చేయాలని అన్నారు.