Sandhya Theatre Incident : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై హైదరాబాద్ నగర పోలీసులు మరోసారి ప్రకటన రిలీజ్ చేశారు. సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రజలను అపోహలకు గురి చేసేలా వీడియోలు పోస్టు చేయవద్దన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన పై సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు సమాచారం, ప్రజలను అపోహలకు గురి చేసేలా వీడియోలు పోస్టు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.
Read Also:Suriya 44: నాది స్వచ్ఛమైన ప్రేమ.. ‘సూర్య 44’ టైటిల్ టీజర్ వచ్చేసింది!
అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్టు కొందరు తప్పుడు వీడియోలు పోస్టు చేసిన అంశం పోలీసుల దృష్టికి వచ్చిందన్నారు. ఈ ఘటన పై విచారణ క్రమంలో తెలిసిన నిజాలను వీడియో రూపంలో పోలీసు శాఖ ఇప్పటికే ప్రజల ముందు ఉంచింది. అయినా కొందరు ప్రజలను తప్పుదోవ పట్టించేలా, అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్టు క్రియేట్ చేసిన కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా పోస్టులు చేసిన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఇలాంటి ఉద్దేశపూర్వక తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read Also:Dead Body in Parcel Case: డెడ్‌బాడీ హోమ్ డెలివరీ కేసులో బిగ్ ట్విస్ట్..
ఈ విషయంలో పోలీసు శాఖను బద్నాం చేసేలా తప్పుడు ప్రచారం చేస్తే సీరియస్ గా పరిగణిస్తామన్నారు. ఒక అమాయకురాలు మరణం, ఒక పిల్లవాడి ప్రాణానికి ప్రమాదం సంభవించిన ఈ కేసులో పోలీసు శాఖ ఎంతో నిబద్ధతతో విచారణ జరుపుతోందని తెలిపింది. దానిని ప్రశ్నించేలా అసత్య ప్రచారాలు, అభూతకల్పనలతో సోషల్ మీడియా ద్వారా ఎవరైనా ప్రచారం చేస్తే సహించేది లేదని పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించి ఏ పౌరుడి దగ్గరైనా ఆధారాలు, అదనపు సమాచారం ఉంటే పోలీసు శాఖకు అందించవచ్చని సూచించింది. కానీ, సొంత వ్యాఖ్యానాలు చేయవద్దని పోలీసు శాఖ తరపున విజ్ఞప్తి చేస్తున్నట్లు ప్రకటించింది. సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు..