Site icon NTV Telugu

Hyderabad: నాంపల్లి ఫర్నిచర్ భవనంలో 90% రెస్క్యూ ఆపరేషన్ పూర్తి.. ఆ ఐదు మంది పరిస్థితి ఏంటి?

Nampally

Nampally

Hyderabad: హైదరాబాద్ నాంపల్లి ఫర్నిచర్ షాప్‌లో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే ఫర్నిచర్ భవనంలో 90% రెస్క్యూ ఆపరేషన్ పూర్తయింది. సెల్లార్లలో చిక్కుకున్న ఐదుగురు ఆచూకీ పూర్తిగా లభించలేదు. రెస్క్యూ ఆపరేషన్‌కు దట్టమైన పొగ అడ్డంకిగా మారింది. మరోవైపు బిల్డింగ్ ముందు భాగాన్ని జేసీబీ సహాయంతో తవ్వారు. ముందు భాగంలో తవ్వడం ద్వారా సెల్లార్లోకి వెళ్లడానికి మార్గం చేశారు. సెల్లార్ లోకి వెళ్లడానికి భవనం మూడు వైపుల హోల్స్ ఏర్పాటు చేశారు. బేస్మెంట్ సెల్లార్‌లో ఇంకా మంటలు చెలరేగుతున్నాయి. రెస్క్యూ టీమ్స్ సెల్లర్ లోపలికి చేరుకున్నాయి. వైద్య సిబ్బంది స్ట్రేచర్స్‌లోపలికి తీసుకెళ్లారు. మరోవైపు అధికారులు అంబులెన్సులు రెడీ చేశారు. బేబీ (42) మహిళ అనే మహిళ, ఇంతియాజ్(28), అఖిల్ (11) అనే మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో ఇప్పటి వరకు ఐదుగురిలో ముగ్గురి మృతదేహాలు వెలికి తీశారు. ఈ మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు.

READ MORE: Mouni Roy: ఫొటోల పేరుతో అసభ్య ప్రవర్తన.. ఈవెంట్ మధ్యలోనే వెళ్లిపోయిన మౌని రాయ్

 

Exit mobile version