Site icon NTV Telugu

HYD Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. మెట్రో సమయాల్లో మార్పులు

Hyderabad Metro

Hyderabad Metro

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బిగ్ అలర్ట్. మెట్రో టైమింగ్స్ లో మార్పులు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో రైళ్ల సేవా సమయాలను సవరించింది. సవరించిన సమయాలు ఈనెల 3 నుంచి అమల్లోకి రానున్నాయి. నవంబర్ 3 నుంచి అన్ని లైన్లలోని టర్మినల్ స్టేషన్ల నుంచి మెట్రో సేవల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 6:00 గంటల నుంచి రాత్రి 11:00 గంటల వరకు నడపనున్నట్లు ప్రకటించింది.

Also Read:Ind-Pak: పాకిస్థాన్ కపటత్వాన్ని మరోసారి యూఎన్‌లో ఎండగట్టిన భారత్

ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను ఈ కొత్త సమయాలకు అనుగుణంగా రూపొందించుకోవాని మెట్రో అధికారులు విజ్ఞప్తి చేశారు. కాగా హైదరాబాద్ మెట్రో అందుబాటులోకి వచ్చాక నగరవాసుల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర పనులకు వెళ్లే వారు మెట్రో జర్నీకే ఇంట్రెస్టు చూపిస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తప్పినట్లైంది.

Exit mobile version