NTV Telugu Site icon

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌… మెట్రో రైలు సమయం పొడిగింపు

Metro

Metro

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు మెట్రో అధికారులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రయాణికుల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని మెట్రో రైల్ సేవలను మరింత విస్తరించేందుకు చర్యలు చేపట్టారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం మెట్రో రైల్ చివరి రైలు సమయాన్ని పొడిగించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి చివరి మెట్రో రైలు రాత్రి 11:00 గంటలకు బదులుగా 11:45 నిమిషాలకు బయలుదేరేలా మార్పు చేశారు. ఈ మార్పు వల్ల రాత్రివేళ ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులకు మెట్రో సేవలు మరింత ఉపయోగకరంగా మారనున్నాయి.

విద్యార్థులు మెట్రో సేవలను మరింతగా వినియోగించుకునేలా 20 ట్రిప్పుల టికెట్ కొనుగోలు చేస్తే 30 ట్రిప్పులు ప్రయాణించే ఆఫర్‌ను మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్టు మెట్రో అధికారులు ప్రకటించారు. ఈ ఆఫర్ విద్యార్థులకు ప్రయాణ ఖర్చును తగ్గించడంతో పాటు మెట్రో ప్రయాణాన్ని ప్రోత్సహించనుంది. హైదరాబాద్ నగర ప్రజా రవాణా వ్యవస్థను పునర్వ్యవస్థీకరించడంలో మెట్రో రైల్ కీలక పాత్ర పోషిస్తోందని మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. మెట్రో రైల్ సేవలను మరింత మెరుగుపరిచేందుకు అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారని, మెట్రో సేవలు నగర వృద్ధికి సహకరించేలా మరింత అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.

ఈ మార్పులతో హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మరింత సౌలభ్యాన్ని అందించనుంది. మెట్రో రైల్ సమయ పొడిగింపు, విద్యార్థులకు ప్రత్యేక ఆఫర్ వంటి మార్పులు ప్రయాణికుల రద్దీని తగ్గించడంతో పాటు మెట్రోను మరింత ప్రజాదరణ పొందేలా చేయనున్నాయి.

MI vs GT: మొదటి గెలుపు కోసం తలబడనున్న ఇరు జట్లు.. విజయం ఎవరిని వరించేనో..!