Hyderabad Hit by Heavy Rain: హైదరాబాద్ సిటీలో పెనుగాలులతో కుండపోత వర్షం కురుస్తోంది.. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, హిమాయత్‌నగర్, లక్డీకపూల్, నాంపల్లి సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది.. పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, అమీర్‌పేట్, మాదపూర్, కొండాపూర్, బయోడైవర్సిటీ, ఐకియా సెంటర్, ఏఎంబీ, ఇనార్బిల్ మాల్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, హైటెక్‌సిటీలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.. వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వచ్చే 2 రోజులపాటు రాష్ట్రంలో విస్తారమైన వర్షాలు పడే అవకాశం ఉంది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
READ MORE: Honda Electric Bike: ఫ్యూచరిస్టిక్ డిజైన్ తో.. హోండా మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేస్తోంది..
రానున్న రెండు రోజులు వర్షాలు ఉంటాయనే సమాచారం ఉన్నందున కలెక్టర్లు జిల్లాల్లోని అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు భారీ వర్ష సూచన ఉన్నందున అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలన్నారు. జీహెచ్ఎంసీతో పాటు పోలీస్, ట్రాఫిక్, హైడ్రా విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని.. లోతట్టు ప్రాంతాల్లో తగిన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. సిటీలో ప్రజలు అత్యవసరమైతే తప్ప తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని పేర్కొన్నారు.
ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, విద్యుత్ అంతరాయం లేకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని.. వర్షాలు, వరదలతో ఎటువంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కునేందుకు, ఎలాంటి సహాయమైనా అందించేందుకు అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
READ MORE: YSRCP: గవర్నర్‌ను కలిసిన వైసీపీ నేతలు.. దాడులపై ఫిర్యాదు..
