Site icon NTV Telugu

Hyderabad: జర్మనీలో నర్సింగ్ జాబ్స్ పేరుతో భారీ మోసం.. రూ. కోట్లల్లో వసూళ్లు!

Job Offer

Job Offer

Hyderabad: జర్మనీలో నర్సింగ్ జాబ్స్ పేరుతో భారీ మోసం చేసిన ఘటన హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌లో చోటు చేసుకుంది. శిక్షణ ఇచ్చి విదేశాలకు పంపిస్తామని చెప్పి కోట్లు వసూలు చేసింది ఓ వీసా కన్సల్టెన్సీ కంపెనీ.. జర్మన్ భాష లో శిక్షణ, వీసా, వసతి, ఉద్యోగం కల్పిస్తామని చెప్పి మోసానికి పాల్పడ్డారు. నెలలు గడిచినా కంపెనీ ఎండీ రఘువీర రెడ్డి స్పందించకపోవడంతో Visa Vision Consultancy వద్ద బాధిత యువకుల ఆందోళన చేపట్టారు.. అనంతరం మలక్‌పేట్ పోలీసులకు యువకులు ఫిర్యాదు చేశారు. కోట్ల రూపాయలు వసూలు చేసి చేతులెత్తేసింది కంపెనీ.. దీంతో చెల్లించిన ఫీజులు తిరిగి ఇవ్వాలని విద్యార్థుల డిమాండ్ చేస్తున్నారు..

READ MORE: Chitrapuri Colony Scam: చిత్రపురి కాలనీ అక్రమాల కేసులో విచారణ పూర్తి.. సినీ పెద్దల పాత్రపై కీలక రిపోర్టు!

ఇదిలా ఉండగా.. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో యువతను మోసగిస్తున్న కేసులో ఐదుగురు నిందితులను తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) అధికారులు ఇటీవల అరెస్టు చేశారు. టీజీసీఎస్‌బీ డైరెక్టర్‌ శిఖాగోయల్‌ కథనం ప్రకారం..‘‘ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి డబ్బు వసూలుచేయడంతోపాటు తమను మయన్మార్‌లో సైబర్‌నేరాలు చేసే ముఠాకు అప్పగించి మోసం చేశారంటూ చరణ్, సంగిరెడ్డి జీవన్‌రెడ్డిలు.. నవంబరు 22న టీజీసీఎస్‌బీలో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు మొదలుపెట్టగా..అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

READ MORE: Kriti Sanon : కృతి సనన్ కామెంట్స్‌పై మహేశ్ బాబు ఫ్యాన్స్ ఫైర్.. ఏమైందంటే?

Exit mobile version