Hyderabad Drug Party: హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. గచ్చిబౌలిలోని ఓ కోలివింగ్ గెస్ట్ రూమ్‌లో జరుగుతున్న డ్రగ్ పార్టీపై ఎస్ఓటీ దాడి చేసి బహిర్గతం చేసింది. రాత్రి వేళలో యువతీయువకులు డ్రగ్స్ మత్తులో మునిగిపోయి పార్టీ చేసుకుంటుండగా పోలీసులు దాడి చేశారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం 12 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. దర్యాప్తులో కీలక వివరాలు బయటపడ్డాయి. కర్ణాటక రాష్ట్రం నుంచి డ్రగ్స్‌ను స్మగ్లింగ్ చేసి హైదరాబాద్ యువకులకు సరఫరా చేస్తున్న గుత్తా తేజకృష్ణ అనే ప్రధాన స్మగ్లర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు డ్రగ్స్ సరఫరాలో పాలుపంచుకున్న ఒక నైజీరియన్ పౌరుడు కూడా అరెస్టయ్యాడు.
READ MORE: YS Jagan Tour: జగన్ పర్యటనపై పోలీసుల షరతులు
డ్రగ్స్ పార్టీలపై ఇప్పటికే హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో పలు కేసులు నమోదవుతున్న వేళ, మరోసారి ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం పోలీసులను అప్రమత్తం చేసింది. గచ్చిబౌలిలోని లగ్జరీ గెస్ట్ హౌస్‌లలో జరుగుతున్న పార్టీలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక దళాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. డ్రగ్ మాఫియాపై కఠిన చర్యలు కొనసాగుతాయని, ఇలాంటి పార్టీలకు హాజరయ్యే వారిని కూడా చట్టం ముందు నిలబెట్టేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
READ MORE: Warangal: వరంగల్‌లో మొంథా తుఫాన్ బీభత్సం.. ఏకంగా 6465 ఇళ్లు..
