Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories Hyderabad Fake Currency Gang Arrested 11 50 Lakhs Seized

Fake Currency : హైదరాబాద్‌లో నకిలీ కరెన్సీ ముఠా అరెస్ట్.. 11.50 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం..!

Published Date :March 14, 2025 , 8:01 pm
By RameshVaitla
Fake Currency : హైదరాబాద్‌లో నకిలీ కరెన్సీ ముఠా అరెస్ట్.. 11.50 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

మన దేశంలో పెద్ద నోట్లు పూర్తిగా రద్దు అయిపోయినాయి ..ఇప్పుడు ఎక్కడ చూసినా చిన్న నోట్లో కనబడుతున్నాయి.. అందులో 500 రూపాయల నోట్లు ఎక్కువగా చలామణి అవుతున్నాయి ..ఎవరి దగ్గర చూసినా చిన్న నోట్ల కంటే 500 రూపాయలు నోట్లు ఎక్కువగా ఉంటాయి.. చిల్లర నోట్లు అసలు కనబడకుండా పోయినాయి.. ఈ 500 నోట్ల చలామణిలో అసలు నోట్లు ఎంత నకిలీ నోట్లు ఎంత అనేది ఎవరికీ తెలియదు ..ఎందుకంటే నకిలీ నోట్లో తయారుచేసి చాలా మంది చేస్తున్న గ్యాంగులు కోకలుగా తయారైనారు. ఈ నకిలీ నోటను కూడా ఇప్పుడు గుజరాత్ నుంచే సరఫరా అవుతున్నట్లు సిటీ పోలీస్ చెప్తున్నారు. ఒక అసలు నోటు కు 10 నకిలీనట్లను ఇస్తున్నారు. అహ్మదాబాద్ గ్యాంగులతో ములాఖత్ అయిన హైదరాబాద్ సిటీలో నకిలీ నోట్లను చలామణి చేస్తున్న గ్యాంగుని ఎల్బీనగర్ పోలీసులు పట్టుకోవడం జరిగింది.. 11 లక్షల రూపాయల నకిలీ కరెన్సీని నోట్లు స్వాదీనం చేసుకున్నారు.. ఒరిజినల్ నోట్లకు తీసిపోని విధంగా నకిలీ నోట్లు తయారు చేశార..ఇవి నకిలీ నోట్లు అనేదానికంటే ఇవే ఒరిజినల్ నోట్లు అని చెప్పవచ్చు. అంత ప్లాన్ ప్రకారం నోటు తయారు చేశారని సిటీ పోలీస్ అంటున్నారు. అయితే ఈ గ్యాంగ్ ప్రధాన కేంద్రం అహ్మదాబాద్ లో ఉన్న అక్కడికి వెళ్లి విచారణ కూడా చేస్తామని చెప్తున్నారు. నకిలీ కరెన్సీ రాకెట్ ను ఎల్బీనగర్ పోలీసులు పట్టుకున్నారు.. ఏడుగురు నిందితులను అరెస్టు చేసారు.. ముఠా నుంచి 11.50 లక్షల నకిలీ కరెన్సీ. 4 లక్షల అసలు కరెన్సీ, 7 మొబైల్ ఫోన్లు, ఒక హోండా సిటీ కారును స్వాధీనం చేసుకున్నారు. పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీలోని శబరి హిల్స్ కాలనీలో నివాసముంటున్న చిన్నోళ్ల మాణిక్య రెడ్డి, నల్గొండ జిల్లా దోమలపల్లి మండలం పారాపల్లిగూడెం గ్రామానికి చెందిన మామిళ్ల జానయ్య, రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లోయపల్లి గ్రామానికి చెందిన బిలకంటి భరత్ కుమార్, మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం ముచ్చింతల గ్రామానికి చెందిన జెల్లా వెంకటేశ్.. రంగారెడ్డి జిల్లా మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన డొంకని సత్యనారాయణ, మహబూబ్ నగర్ జిల్లా తొర్రూర్ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన గుండాల వెంకటేశ్, ఏపీలోని విశాఖపట్నం జిల్లా బాపూజీనగర్, కంచర్లపాలెంకు చెందిన కె. శివశంకర్, పరారీలో ఉన్న గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ కు చెందిన సురేశ్ అలియాస్ సురేశ్ భాయ్ మొత్తం ఎనిమిది మంది ముఠాగా ఏర్పడి నకిలీ కరెన్సీ నోట్లు చలామణి చేస్తున్నారు.

కేసులో ప్రధాన నిందితుడు మాణిక్యరెడ్డి కూకట్‌పల్లి ప్రాంతంలోని నిజాంపేటలో నివసిస్తున్నప్పుడు, అతడి భార్య గుండెపోటుతో మృతి చెందింది. ఈ క్రమంలో ప్రకేష్ వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నది. తక్కువ సమయంలో సులభంగా డబ్బు సంపాదించడానికి నకిలీ కరెన్సీ చలామణి చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇతడు ఆన్‌లైన్‌లో గుజరాత్‌లోని అహ్మదాబాద్ నివాసి, నకిలీ కరెన్సీ నోట్లను విక్రయించే సురేశ్ అలియాస్ సురేశ్ భాయ్ అనే వ్యక్తిని సంప్రదించాడు. జనవరిలో మాణిక్యరెడ్డి అహ్మదాబాద్‌కు వెళ్లి సురేశ్ కు 1 లక్ష ఒరిజినల్ కరెన్సీ ఇచ్చి 11.50 లక్షల నకిలీ కరెన్సీని కొనుగోలు చేశాడు. అనంతరం నకిలీ కరెన్సీ చలామణి చేయడానికి మాణిక్య రెడ్డి తన ప్రణాళికను జానయ్య, వెంకటేశ్, సత్యనారాయణ, భరత్, జి. వెంకటేశ్ కు వివరించాడు. నకిలీ కరెన్సీ తో పాటు నకిలీ బంగారం బిస్కెట్లు విక్రయించడానికి కుట్ర పన్నారు. జానయ్య నకిలీ కరెన్సీని కొనుగోలు చేసేవారిని మాణిక్యరెడ్డికి పరిచయం చేసేవాడు. ఇతను 1 లక్ష అసలు కరెన్సీని తీసుకొని 4 లక్షలు నకిలీ కరెన్సీ ఇచ్చేవాడు.

మాణిక్య రెడ్డి, అతడి అనుచరులు అక్కడి నుంచి పరారయ్యేవారు. గుజరాత్ కు చెందిన సురేశ్ ఈ నెల 11న మాణిక్యరెడ్డికి ఫోన్ చేసి విశాఖపట్నంలోని కంచర్లపాలెం నివాసి శివశంకర్‌ను ఫోన్ ద్వారా పరిచయం చేసి నకిలీ కరెన్సీ నోట్లు ఇవ్వాలని సూచించాడు. శివశంకర్ ను హైదరాబాద్ కు రావాలని మాణిక్య రెడ్డి చెప్పాడు. ఈ క్రమంలో ఈనెల 13న శివ శంకర్ 4 లక్షల అసలు కరెన్సీతో హైదరాబాద్‌ లోని ఎల్బీనగర్ ప్రాంతం చింతలకుంటకు వచ్చాడు. చింతలకుంట చెక్‌పోస్ట్ సమీపంలోని మెక్‌డొనాల్డ్స్ ఎదురుగా మాణిక్యరెడ్డి, అతడి అనుచరులతో వ్యాపారం చేస్తున్నాడు. ముఠా నుంచి నుంచి హోండా సిటీ కారు , 10 నకిలీ బంగారు బిస్కెట్లు, 11.50 లక్షల నకిలీ కరెన్సీ, 4 లక్షల అసలు కరెన్సీ, స్వాధీనం చేసుకున్నారు. అసలైన నోట్లకు దీటుగా వీళ్ళు నక్లీ నోట్లు తయారుచేసి విక్రయిస్తున్నారని పోలీసులు చెప్తున్నారు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • counterfeit money
  • Crime News
  • Currency Scam
  • Fake Currency
  • fake notes

తాజావార్తలు

  • Off The Record : శైలజానాథ్ రాకతో టికెట్ కథ మళ్లీ మొదటికొచ్చిందా? లెక్కలు మారితే మళ్లీ చిక్కులేనని టెన్షన్

  • OTR: జనసేన నేత ఇల్లు కూల్చివేతతో రాజకీయ ప్రకంపనలు.. పేర్ని నాని ఎంట్రీతో కూటమిలో రచ్చ!

  • Central Govt: మీకు ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసా..? అయితే రూ.10 వేలు మీకే..

  • OTR: ఓల్డేజ్ హోంగా బీఆర్ఎస్.. అప్పుడే గులాబీ తోటలో ప్రకంపనలు!

  • Madhapur job scam : సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరిట భారీ మోసం..రూ.5 కోట్లు బురిడీ..

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions