హైదరాబాద్ లో భారీ డ్రగ్ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు.. డ్రగ్స్ సేవిస్తున్న పది మందిని ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ టీం అదుపులోకి తీసుకుంది. ఇద్దరు పెడ్లర్లతో పాటు 8 మంది ట్రాన్స్‌జెండర్ (గే) కన్జ్యూమర్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పెడ్లర్ల నుంచి వంద గ్రాముల ఎండీ ఎంఎస్ స్వాధీనం చేసుకున్నారు. Grinder అనే యాప్ ద్వారా డ్రగ్స్ కొనుగోలు, అమ్మకాలు చేస్తున్నట్లు గుర్తించారు. ఇందులో ట్రాన్స్‌జెండర్లు (గే) సైతం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ నపుంసకులకు డ్రగ్స్ సప్లై చేసిన నైజీరియన్‌ను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం పది మందిని అదుపులోకి తీసుకోగా.. అందులో 8 మంది “గే” లే ఉండటం గమనార్హం.
READ MORE: Gas Cylinder Code: గ్యాస్ సిలిండర్‌పై ఉండే కోడ్ అర్థం మీకు తెలుసా?
నేటితరం యువతతో పాటు పాఠశాల విద్యార్థుల్లోనూ మత్తు పదార్థాల వినియోగం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వీటిని అరికట్టడానికి కేంద్రం, రాష్ట్రాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా ఈ జాబితాలో “గే” లు సైతం చేరడం ఆందోళన కలిగిస్తోంది. డ్రగ్స్ నిరోధక చట్టాలను పదును తేల్చడం, శిక్షల పెంపుతో పాటు పోలీస్, కస్టమ్స్, ఎక్సైజ్ తదితర విభాగాల సమన్వయంతో సమష్టి కార్యాచరణ చేపడుతున్నాయి. స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించడం, జాతీయ డీ-ఎడిక్షన్ హెల్ప్‌లైన్ (14446) తీసుకురావడంతో పాటు ‘నశా ముక్త్ భారత్’ వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి. మాదక ముఠాల పనిపట్టడానికి ఏపీ పోలీస్ శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. డ్రగ్స్‌వల్ల వాటిల్లే దుష్పరిణామాలపై అవగాహన కల్పించడం, బాధితులకు అండగా నిలవడం వంటి వాటికీ ప్రభుత్వాలు ప్రాధాన్యమిస్తున్నాయి. అయితే, వీటితోపాటు యువత డ్రగ్స్‌ను కోరుకోవడానికి కారణమవుతున్న సామాజిక, మానసిక అంశాలపై లోతైన అవగాహన అవసరం.
READ MORE: UP: భార్యాభర్తల మధ్య ఘర్షణ.. బిల్డింగ్‌పైకి ఎక్కి భార్య ఏం చేసిందంటే..!
