Hyderabad: భారీ వర్షాలతో హైదరాబాద్ కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.. ఇళ్లల్లోకి వర్షపునీరు చేరడం, ట్రాఫిక్‌కు అంతరాయం, విద్యుత్ సమస్యలపై కంట్రోల్ రూమ్‌కి సమాచారం అందించాలని అధికారులు కోరారు.. ఫోన్ చేయాల్సిన నంబర్లు 040-2302813 / 74166 87878.. వర్షాల కారణంగా రెవెన్యూ అధికారులకు సెలవులు రద్దు చేశారు. రెవెన్యూ అధికారులందరూ అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. హైడ్రా, జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీసులతో కలిసి పనిచేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మరోవైపు.. వర్షం కారణంగా మెట్రోలో రద్దీ పెరిగింది. సాయంత్రం నుంచి వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. దీంతో నగర వాసులు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. మెట్రో స్టేషన్లు.. ఎంట్రీ, ఎగ్జిట్ వద్ద క్యూ లైన్లు భారీగా మారాయి.
READ MORE: Off The Record: సీఎం వార్నింగ్ ఇచ్చినా మారడం లేదా..? ఎమ్మెల్యేలే కూటమి కొంప ముంచబోతున్నారా?
కాగా.. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది.. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఓ వైపు వర్షం.. మరో వైపు ట్రాఫిక్ జామ్‌తో వాహనదారుల ఇక్కట్లు పడుతున్నారు.. కిలో మీటర్ల మేర రోడ్లపై ట్రాఫిక్ నిలిచిపోయింది. చాదర్‌ఘాట్ నుంచి ఎల్బీ నగర్ వరకు భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది.. అంతే కాకుండా సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా.. అత్యధిక వర్షపాతం నమోదైంది.. గచ్చిబౌలిలో 12.5 సెం.మీ, ఖాజాగూడలో 12, ఎస్‌ఆర్ నగర్‌లో 11, శ్రీనగర్ కాలనీలో 11.1, ఖైరతాబాద్‌లో 10.09, యూసుఫ్‌గూడలో 10.4, ఉప్పల్‌లో 10, బంజారాహిల్స్‌లో 9, నాగోల్‌లో 8.8 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మరో మూడు నుంచి నాలుగు గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
