Hyderabad Air Pollution: హైదరాబాద్‌లో గాలిలో నాణ్యత ప్రమాణాలు పడిపోయాయి.. దీపావళి సందర్భంగా నగరంలో టపాసుల మోత మోగింది. దీంతో నగరంలో నిన్న సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు తీవ్ర స్థాయిలో కాలుష్యం చోటు చేసుకుంది. కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం అత్యధికంగా సనత్ నగర్‌లో PM 10 స్థాయి- 153 µg/m³ (మైక్రోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్) గా నమోదైంది. న్యూ మలక్ పేట 164 µg/m³, కాప్రా 140 µg/m³, కోకాపేట 134 µg/m³, సోమాజిగూడ 122 µg/m³, రామచంద్రాపురం 122µg/m³, కొంపల్లి 120µg/m³ గా నమోదయ్యాయి.
READ MORE: Trump: చైనాకు ట్రంప్ మరో హెచ్చరిక.. అదే జరిగితే 155 శాతం సుంకం ఉంటుందని వార్నింగ్
ఇదిలా ఉండగా.. దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. వాతావరణం పూర్తిగా కలుషితం అయిపోయింది. దీనికి దీపావళి పండుగ తోడైంది. నిన్నటిదాకా ఒకెత్తు.. ఈరోజు మరొకెత్తుగా మారిపోయింది. మంగళవారం ఉదయం 8 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 350 దగ్గర నమోదైంది. ప్రమాదకర స్థాయిలో గాలి నాణ్యత నమోదు కావడంతో పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా.. ఢిల్లీలో గ్రీన్ కాకర్స్ కాల్చుకునేందుకు దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. అంతేకాకుండా దీనికంటూ ఒక సమయాన్ని కూడా కేటాయించింది. కానీ గ్రీన్ కాకర్స్ కాకుండా పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రి కాల్చినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం వాతావరణం చాలా మబ్బుగా కనిపిస్తోంది. పూర్తిగా గాలి నాణ్యత కోల్పోయింది. దీంతో గ్రీన్ క్రాకర్స్ కాకుండా విపరీతంగా రాకెట్లు, బాణాసంచా కాల్చి ఉంటారని అనుమానిస్తున్నారు.
READ MORE: CM Revanth Reddy: పోలీసులు అంటే నమ్మకం.. ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటాం..
