Hussain Sagar: గత రెండురోజుల నుంచి పడుతున్న వర్షాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలలోని కాలువలు, చెరువులు, జలాశయాలు, రిజర్వాయర్లు నీళ్లతో కలకాలాడుతున్నాయి. ఇందులో భాగంలోనే హైదరాబాద్ నగరంలోని ప్రసిద్ధ హుస్సేన్ సాగర్ ప్రస్తుతం వరద నీటితో ఉప్పొంగిపోతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా నీరు వచ్చి చేరడంతో సరస్సు నీటి మట్టం ఫుల్ ట్యాంక్ లెవెల్‌ను దాటింది. బంజారా, పికెట్, కూకట్‌పల్లి, బుల్కాపూర్ నాళాల ద్వారా హుస్సేన్ సాగర్‌లోకి వరద నీరు భారీగా వస్తోంది. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ సరస్సులోకి 1873 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 1438 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ద్వారా నీటిని బయటకు వదులుతున్నారు అధికారులు.
Chairman’s Desk: న్యాయవ్యవస్థ విశ్వసనీయత ప్రమాదంలో ఉందా..?
ఇకపోతే హుస్సేన్ సాగర్ ప్రస్తుత నీటి మట్టం 513.61 మీటర్లు కాగా, ఇది ఫుల్ ట్యాంక్ లెవెల్ అయిన 513.41 మీటర్లను మించి ఉంది. దీంతో నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు తూముల ద్వారా నీటిని మూసిలోకి విడుదల చేస్తున్నారు. వనాలు ఇంకా కురుస్తుండడంతో అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, వరద ప్రభావాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. హుస్సేన్ సాగర్ నుంచి బయటకు వదులుతున్న నీటితో మున్సిపల్ డ్రెయినేజీ వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతున్నందున పలు ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. హుస్సేన్ సాగర్ నీటి మట్టం పెరుగుతున్న తరుణంలో, నగరవాసులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
New Born Baby: 2 గుండెలు, 2 తలలు, 2 కాళ్లు, 4 చేతులతో వింత శిశువు జననం!
