Site icon NTV Telugu

Mexico: ప్రేమికుల రోజు.. ఒక్కటైన వందలాది స్వలింగ జంటలు

Mexico

Mexico

Mexico: నచ్చిన వారిని పెళ్లిచేసుకోవాలని భావించినవారు కులం, మతం, ప్రాంతాన్ని పట్టించుకోరు. మరికొందరు తమ లింగ బేధాన్ని కూడా పట్టించుకోకుండా ఒకే లింగం వారినీ పెళ్లి చేసుకుంటూనే ఉంటారు. అదేవిధంగా మెక్సికోలో వందలాది స్వలింగ జంటలు ఒక్కటయ్యాయి. స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయడంతో మెక్సికోలో వాలెంటైన్స్ డే సందర్భంగా మంగళవారం జరిగిన సామూహిక వేడుకలో వందలాది జంటలు వివాహం చేసుకున్నారు.

తాము ఫిబ్రవరి 14న కలుసుకున్నందున ఇది తమకు ప్రత్యేకమైన తేదీ అంటూ 24 ఏళ్ల సరాయ్ వర్గాస్ తన భాగస్వామి యాజ్మిన్ అకోస్టా(27)ను వివాహం చేసుకుంది. మెక్సికో స్టేట్‌లో మూడు నెలల క్రితం స్వలింగ వివాహం ఆమోదించబడినందున తాము సంతోషంగా ఉన్నామని, కాబట్టి ఈ సంవత్సరం వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నామని ఆమె వెల్లడించింది.

Cheating Case: ఫారిన్ తీసుకెళ్తానని చెప్పి.. డాక్టర్లకే పంగనామాలు పెట్టాడు..

దాదాపు 1,000 జంటలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి, ఇందులో 35 స్వలింగ సంఘాలు ఉన్నాయి. పాల్గొన్న వారికి అధికారులు కేశాలంకరణ, మేకప్ సేవలను అందించారు. మెక్సికో దేశంలోని 32 రాష్ట్రాలలో అత్యధిక జనాభా కలిగిన మెక్సికో రాష్ట్రంలో వివాహ సమానత్వం అక్టోబర్‌లో ఆమోదించబడింది. మెక్సికో సిటీ 2010లో స్వలింగ సంయోగాలను జరుపుకున్న మొదటి నగరంగా మారింది. ఒక దశాబ్దం తర్వాత లాటిన్ అమెరికన్ దేశం అంతటా స్వలింగ వివాహం ఇప్పుడు చట్టబద్ధం చేయబడింది.

Exit mobile version