NTV Telugu Site icon

Indian Army: మానవత్వం చాటుకున్న భారత జవాన్లు.. అసలేమైందంటే..?

Indian Army

Indian Army

జవాన్లంటే బార్డరులో కాపలా కాస్తూ దేశాన్ని రక్షించే రక్షకులు మాత్రమే కాదు.. దేశ ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చిన సాయం చేసే సేవకులమని నిరుపించుకున్నారు. భారత జవాన్లు మరోసారి మానవత్వం చాటుకున్నారు. మారుమూల పల్లెలో నివసిస్తున్న ఓ గర్భిణినిని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడారు. అసలేం జరిగిందంటే.. జమ్మూ- కశ్మీర్ లోని కుప్వాడా జిల్లాలో నియంత్రణ రేఖ వెంట ఉన్న మారుమూల పల్లెకు చెందిన ఓ గర్భిణి ఆరోగ్యం విషమించింది. అక్కడ వైద్యం అందించేందుకు సరైన ఆస్పత్రులు, వైద్యులు లేని పరిస్థితి.

READ MORE: MLC Kavitha: లిక్కర్ కేసులో కవిత బెయిల్ పై ఇవాళ తీర్పు..

ఆ ప్రాంతంలో భారీగా మంచు కురవడంతో వేరే ప్రాంతానికి సైతం తీసుకెళ్లలేక కుటుంబ సభ్యులు సతమతమవుతున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న గుగల్ధార్ బెటాలియన్ రంగంలోకి ఘటనా స్థలానికి చేరుకుంది. జుమాగుండ్లోని ఆర్మీ యూనిట్ నర్సింగ్ అసిస్టెంట్, పీకే గలిలోని వైద్యాధికారి ఆమెకు ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం అందించాల్సి రావడంతో గర్భిణిని స్ర్టెచర్ పైకి చేర్చిన జవాన్లు కాలినడకన వేరే ప్రాంతానికి సురక్షితంగా తరలించారు. అక్కడ ఆమెకు ప్రస్తుతం వైద్యం అందిస్తున్నారు. ఓ వైపు జోరుగా మంచు కురుస్తోంది. రోడ్డు కూడా పూర్తిగా మంచుతో మూసుకుపోయిన పరిస్థితి. కాని ఎలాగైనా ఆ గర్భిణి ప్రాణాలు కాపాడాలని పూనుకున్నారు. గ్రామాస్థుల సాయంతో సురక్షితంగా ఆస్పత్రికి తరలించి శభాష్ అనిపించుకున్నారు.