Site icon NTV Telugu

Explosion: తమిళనాడులో భారీ పేలుడు.. ఒకరు మృతి

Explosion

Explosion

తమిళనాడులోని విరుదునగర్‌లోని బాణసంచా కర్మాగారంలో ఆదివారం పేలుడు సంభవించింది. విరుదునగర్ జిల్లాలోని సత్తూరు సమీపంలోని హిందుస్థాన్ క్రాకర్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు చోటుచేసుకుంది. పేలుడు ధాటికి ఫ్యాక్టరీలోని యాబై గదుల్లో 15 గదులు ఫూర్తిగా నేలమట్టమయ్యాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఫ్యాక్టరీ లో పదుల సంఖ్యలో కార్మికులు ఉన్నట్లు గుర్తించారు. గాయపడిన వారిని శివకాశి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఘటనా స్థలి చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టంగా పొగలు అలుముకున్నాయి. భారీ పేలుడు సంభవించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Exit mobile version