Blast : ఎల్బీనగర్ లో భారీ పేలుళ్లు సంభవించాయి. పేలుడు దాటికి చుట్టుపక్కల ఇళ్లు కంపించడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. స్థానికంగా వాసవీ కన్స్ట్రక్షన్ నిర్మిస్తున్న ఆనంద నిలయం ప్రాజెక్ట్ లో ప్రమాదం జరిగింది. బండరాళ్లను పగులగొట్టడం కోసం పేలుడు పదార్థాల ఉపయోగించారు. దీంతో పేలుడు దాటికి బండరాళ్లు పక్క ఇళ్లపై పడ్డాయి. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. పేలుడు దాటికి పక్కన ఉన్న కాలనీలో కంపించాయి. ఇళ్ల గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. పేలుడు దాటికి చుట్టుపక్కల కాలనీవాసులు భయపడిపోయారు.
Read Also:Beautiful Islands: ప్రపంచంలోని 10 అందమైన ద్వీపాలు
బాధిత కాలనీ వాసుల ప్రకారం.. గత ఆరునెలలుగా ఇక్కడ వర్క్ నడుస్తుందని తెలిపారు. ఒక్కసారిగా భారీ శబ్ధం రావడంతో.. రాళ్లు వచ్చి ఇళ్ల మీద పడ్డాయన్నారు. భూకంపం వచ్చిందేమో అనుకుని అందరూ బయటకు పరుగులు పెట్టామన్నారు. ఇక్కడ రెగ్యులర్ గా బ్లాస్టింగ్ సౌండ్స్ వస్తాయి.. గతంలో డస్ట్ వస్తే కంప్లైంట్ చేసాం చుట్టూ రేకులు ఏర్పాటు చేశారని వాళ్లు చెప్పారు. ఇళ్లకు అనుకుని పూడిక తీస్తున్నారన్నారు. లోపల వర్క్ చేస్తున్న వారికి కూడా రాళ్లు తగిలాయి.. వారిని ఎవరు చూడకుండా బయటకి తీసుకెళ్లారు. గతంలో ఇలా జరిగిన కూడా ప్రమాదం ఏం లేదు.. కాబట్టి పట్టించుకోలేదు.. ఎవరికి ఇబ్బంది లేకుండా ఇళ్లకు కొంత దూరంగా కన్స్ట్రక్షన్ చేయాలన్నారు.. దీనిపై పోలీసులకు.. జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేస్తామని కాలనీ వాసులు చెబుతున్నారు.
Read Also:SRH vs LSG: సన్‌రైజర్స్‌పై లక్నో విజయం.. 16 ఓవర్లలోనే సమాప్తం