NTV Telugu Site icon

Currency Notes In Drain : మురికి కాల్వలో కరెన్సీ నోట్లు.. వీడియో చూస్తే మీరు షాకే..

Money

Money

పారే మురికి కాల్వను చూడటానికి ఘోరంగా ఉంటుంది. అందులో నీళ్లు కంపు కొడుతున్నాయి. దుర్వాసనతో దర్శనమిస్తున్నాయి. ఎక్కడ చూసినా చెత్తా చెదారమే. అటు వైపు వెళ్లేందుకే కాదు కదా.. కనీసం చూడటానికి కూడా జనాలు ఇష్టపడరు. అలాంటి మురికి కాల్వలో ఒక్కసారిగా కలకలం రేపుతుంది. జనాలు పెద్ద సంఖ్యలో మురికి కాల్వలోకి దిగారు. కంపు, దుర్వాసన, చెత్తా చెదారాన్ని అస్సలు లెక్క చేయలేదు. ఆ మురికి కాల్వలోకి దూసుకెళ్లారు. ఎందుకో తెలుసా? కరెన్సీ నోట్ల కోసం ఎగబడ్డారు. ఏందీ మీరు షాక్ అయ్యారా? అవునండీ.. మురికి కాలువలో పెద్ద సంఖ్యలో కరెన్సీ నోట్లు దర్శనం ఇచ్చాయి. డబ్బంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఆ నోట్లను ఏరుకునేందుకు జనాలు మురికి కాల్వలోకి దిగారు.

Also Read : Mobile Phones: ఎక్కువ సేపు ఫోన్ మాట్లాడుతున్నారా..? అయితే మీరు హైబీపీ బారిన పడొచ్చు..

ఈ ఘటన బీహార్ లోని రోహ్తాస్ జిల్లా మోరాబాద్ గ్రామంలో చోటు చేసుకుంది. అక్కడ పారే మురికి కాల్వలో కరెన్సీ నోట్లు ప్రత్యేక్షమయ్యాయి. నోట్ల కట్టలు తీసుకునేందుకు ప్రజలు పోటీలుపడ్డారు. దొరికిన వారు దొరికినంత డబ్బుల కట్టలను తీసుకెళ్లారు. కరెన్సీ నోట్లలో రూ.2వేలు, రూ.500, రూ.100, 10 రూపాయల నోట్ల కట్టలు ఉన్నాయి. మురికి కాల్వలోకి దిగిన ప్రజలు నోట్ల కట్టలు ఏరుకుంటున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read : Sunday stotram: ఇంటిల్లిపాది ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు బ్రతుకుతారు ఈ స్తోత్ర పారాయణం చేయండి

ఉదయాన్ని మురికి కాల్వలో రెండు బ్యాగులు కనిపించాయి అని స్థానికులు చెప్పుకొచ్చారు. అందులో కరెన్సీ నోట్లు ఉన్నాయి. దాంతో పెద్ద సంఖ్యలో స్థానికులు కాలువలోకి దూకి నోట్ల కట్టలు ఏరుకున్నారు. అవి ఒరిజినల్ నోట్లే అని స్థానికులు చెబుతున్నారు. దీని గురించి పోలీసులకు సమాచారం వెళ్లింది. పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. అసలు.. కరెన్సీ నోట్లు ఒరిజినలా? లేక ఫేకా? ఒకవేళ ఒరిజినల్ నోట్లే అయితే ఆ డబ్బుని ఎవరు కాలువలో పడేశారు? ఇలా అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేపట్టారు. మురికి కాలువలో మనీ వెనుక మిస్టరీని చేధించే పనిలో పోలీసులు పడ్డారు.