NTV Telugu Site icon

HUAWEI nova 14 Series: శాటిలైట్ కమ్యూనికేషన్, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో హువావే నోవా 14 సిరీస్ లాంచ్..!

Huawei Nova 14 Series

Huawei Nova 14 Series

HUAWEI nova 14 Series: చైనా టెక్ దిగ్గజం హువావే (HUAWEI) తాజాగా nova 14 సిరీస్ ను అధికారికంగా విడుదల చేసింది. ఈ సిరీస్‌లో నోవా 14, నోవా 14 Pro, నోవా 14 అల్ట్రా మూడు మోడళ్లను పరిచయం చేసింది. ఈ లాంచ్ నేడు (మే 20) మెట్ బుక్ ఫోల్డ్ అల్టిమెట్ డిజైన్ ల్యాప్టాప్‌తో పాటు జరిగింది. ప్రతి ఫోన్ మోడల్ ప్రత్యేకమైన ఫీచర్లతో మార్కెట్‌లోకి అడుగుపెడుతోంది. మరి ఆ వివరాలేంటో ఒకేసారి చూసేద్దామా..

Read Also: AP ICET 2025: ఐసెట్‌ ఫలితాలు విడుదల.. విశాఖ విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్!

HUAWEI nova 14 Ultra:
ఈ మొబైల్ 6.81-అంగుళాల LTPO 3.0 డిస్‌ప్లే (2860×1272px, 460 ppi), 1–120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 5500 నిట్స్ బ్రైట్‌నెస్ డిస్‌ప్లే కలిగి ఉంది. అలాగే 7.78mm స్లిమ్ మైక్రో కర్వ్ బాడీ, స్క్రాచ్ రెసిస్టెంట్ గ్లాస్, 616 స్టార్లైట్ డైమండ్లతో ఇల్యూమినేటెడ్ రింగ్ కలిగి ఉంది. 50MP RYYB ప్రధాన కెమెరా (F1.4–F4.0, OIS, AIS), 50MP పెరిస్కోప్ టెలిఫోటో (3.7x ఆప్టికల్, 100x డిజిటల్ జూమ్), 13MP అల్ట్రా వైడ్ మాక్రో కెమెరాలు ఉన్నాయి. అలాగే 50MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇక ఇందులో ప్రత్యేకతల విషయానికి వస్తే.. DaVinci Portrait Engine, AI ఫోటో ఎడిటింగ్, స్టార్ ఫ్లాష్ రేటరీవాల్, Tiantong శాటిలైట్ కాలింగ్ లు ఉన్నాయి. ఇంకా IP68/IP69 వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంది.

HUAWEI nova 14 Pro:
నోవా 14 ప్రో మొబైల్ 6.78 అంగుళాల LTPO డిస్‌ప్లే (2776 × 1224px, 449 ppi), 1200 నిట్స్ బ్రైట్‌నెస్ డిస్‌ప్లే కలిగి ఉంది. అలాగే 7.68mm స్లిమ్ బాడీ, ఐస్ క్రిస్టల్ టెక్స్చర్ డిజైన్ ను పరిచయం చేసారు. ఇక కెమెరా విషయానికి వస్తే.. వెనుక కెమెరాలుగా.. 50MP ప్రధాన కెమెరా (RYYB), 12MP టెలిఫోటో (3x ఆప్టికల్ జూమ్), అల్ట్రా వైడ్ మాక్రోతో వస్తుండగా.. 50MP PDAF ఫోకస్‌తో, డ్యూయల్ ఫ్లాష్ తో ఫ్రంట్ కెమెరా అందించనున్నారు. ఇక ఇందులో ఫీచర్లు చూస్తే.. AI పోర్ట్రెయిట్, స్టార్ ఫ్లాష్ రేటరీవాల్, AI మ్యాజిక్ షిఫ్ట్, HarmonyOS 5, శాటిలైట్ మెసేజింగ్ అందుబాటులో ఉన్నాయి.

Read Also: Balakrishna : 10 నిమిషాల కోసం 22 కోట్లు?

HUAWEI nova 14:
నోవా 14 మొబైల్ లో 6.7 అంగుళాల OLED స్ట్రైట్ డిస్‌ప్లే, 1100 నిట్స్ బ్రైట్‌నెస్, 2160Hz PWM డిమ్మింగ్ డిస్‌ప్లేను అందించారు. ఈ మొబైల్ 7.18mm మందం, 192 గ్రాముల బరువు ఉంటుంది. ఇక మొబైల్ వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరా, 12MP టెలిఫోటో, అల్ట్రా వైడ్ మాక్రో లెన్స్ ఉండగా.. ఫ్రంట్ సైడ్ 50MP కెమెరా ఉంది. ఇక ఇందులో DaVinci పోర్ట్రైట్ థీమ్, నైట్ పోర్ట్రెయిట్ మోడ్, హ్యూమానిటీస్ మోడ్, నెట్‌వర్క్ రికవరీ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇక ఈ nova 14 సిరీస్‌లో ఉమ్మడి ఫీచర్లుగా.. HarmonyOS 5 తో సహా మేజిక్ ఇమేజ్ షిఫ్ట్, AI పోర్ట్రెయిట్ రిటచింగ్ వస్తుంది. అలాగే Beidou శాటిలైట్ మెసేజింగ్ సపోర్ట్, 5500mAh బ్యాటరీ, 100W సూపర్ ఛార్జ్ టర్బో, Huawei బింగ్‌టాంగ్ చార్జర్ ఉండనున్నాయి. Wi-Fi 7+, Beidou నావిగేషన్, Ark ఇంజిన్, AI టెలిపోర్టేషన్, టచ్ అండ్ షేర్, ప్రైవసీ లైట్, Xiaoyi ఇన్టెలిజెంట్ ఏజెంట్ లు ఉన్నాయి. ఇక ధరల విషయానికి వస్తే.. వివిధ వేరియంట్స్ రూ. 31,990 నుండి రూ. 59,250 వరకు అందుబాటులో ఉన్నాయి. ఇక nova 14 Ultra, Pro లు మే 23, 2025 నుండి.. nova 14 మే 30 నుండి విక్రయానికి అందుబాటులో ఉండనున్నాయి.