Site icon NTV Telugu

2.5K డిస్‌ప్లే, HarmonyOS 5.1, 10,100mAh బ్యాటరీతో Huawei MatePad 11.5 (2026) టాబ్లెట్ లాంచ్..!

Huawei Matepad 11.5 (2026)

Huawei Matepad 11.5 (2026)

Huawei MatePad 11.5 (2026): హువాయే (Huawei) తాజాగా టాబ్లెట్ పోర్ట్‌ఫోలియోను విస్తరించుతూ MatePad 11.5 (2026)ను చైనాలో అధికారికంగా విడుదల చేసింది. nova 15 సిరీస్‌తో పాటు లాంచ్ అయిన ఈ టాబ్లెట్‌ను విద్య, వినోదం, సాధారణ వినియోగం కోసం రూపొందించారు. ఇది స్టాండర్డ్, సాఫ్ట్ లైట్, ఫుల్ నెట్‌వర్క్ అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ కొత్త టాబ్లెట్ పూర్తి మెటల్ యూనిబాడీ డిజైన్‌తో వస్తుంది. అల్యూమినియం ఎక్స్‌ట్రూజన్ ఫోర్జింగ్, బెండింగ్ ప్రాసెస్‌ల ద్వారా తయారు చేయడంతో టాబ్లెట్ మందం 10% తగ్గి, పర్ఫార్మన్స్ 30% పెరిగిందని కంపెనీ తెలిపింది.

ఈ టాబ్లెట్‌లో 11.5 అంగుళాల 2.5K డిస్‌ప్లే (2456 × 1600 పిక్సెల్స్) ఉంది. గరిష్టంగా 600 నిట్స్ బ్రైట్‌నెస్, 256 PPI పిక్సెల్ డెన్సిటీ, అలాగే 60Hz, 90Hz, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అందిస్తుంది. DC డిమ్మింగ్, ఆటో బ్రైట్‌నెస్ అడ్జస్ట్‌మెంట్, హార్డ్‌వేర్ లెవల్ లో బ్లూ లైట్ ప్రొటెక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సాఫ్ట్ లైట్ వేరియంట్‌కు SGS లౌ విజువల్ ఫ్యాటీగీ 2.1 గోల్డ్ సర్టిఫికేషన్, TÜV Rheinland సర్టిఫికేషన్లు లభించాయి.

50MP+50MP+50MP కెమెరా సెటప్, 6000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ తో Huawei Nova 15 లాంచ్..!

టాబ్లెట్ వెనుక భాగంలో 13MP కెమెరా (f/1.8 అపర్చర్, ఆటోఫోకస్), ముందు భాగంలో 8MP ఫ్రంట్ కెమెరా (f/2.0) ఉన్నాయి. స్టాండర్డ్ వేరియంట్‌లో Kirin T82B ప్రాసెసర్, సాఫ్ట్ లైట్ వేరియంట్‌లో Kirin T82 ప్రాసెసర్ ఉపయోగించారు. ఈ టాబ్లెట్ HarmonyOS 5.1పై పనిచేస్తుంది. 8GB / 12GB RAM, 128GB / 256GB స్టోరేజ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మెరుగైన పనితీరు కోసం హీట్ డిసిపేషన్ మ్యాట్రిక్స్‌ను అందించారు.

Huawei MatePad 11.5 (2026)లో 10,100mAh బ్యాటరీ (10,000mAh రేటెడ్) ఉంది. ఇది లోకల్ వీడియో ప్లేబ్యాక్‌లో 14 గంటల వరకు పనిచేస్తుంది. 40W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది. ఆడియో కోసం HUAWEI Histen 9.0 టెక్నాలజీతో క్వాడ్ స్పీకర్లు, రెండు మైక్రోఫోన్లు ఉన్నాయి. హిడెన్ డ్యూయల్ యాంటెనాలతో మెరుగైన Wi-Fi కనెక్టివిటీ అందుతుంది. ఈ టాబ్లెట్‌లో AI ఆధారిత హోంవర్క్ కరెక్షన్, ఇంటరాక్టివ్ వివరణలు, మైనర్ మోడ్ (పిల్లల కోసం కంటెంట్ ఫిల్టరింగ్, యాప్ లిమిట్స్), స్టడీ మోడ్, డూ నాట్ డిస్టర్బ్, ఐ ప్రొటెక్షన్ మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

11 అంగుళాల FHD+ డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, బెస్ట్ పర్‌ఫార్మెన్స్ తో itel Vista Tab లాంచ్.. ధర ఎంతంటే.?

Huawei Notes యాప్‌లో హ్యాండ్‌రైటింగ్, స్కెచింగ్, ఫార్ములా గుర్తింపు, AI ఆధారిత సమస్య పరిష్కారం సపోర్ట్ ఉంది. మూడు అనిమేటెడ్ లెర్నింగ్ క్యారెక్టర్లు, క్రాస్-డివైస్ కలాబరేషన్, డ్రాగ్-అండ్-డ్రాప్ ఫీచర్లు కూడా ఉన్నాయి. HUAWEI M-Pencil (3వ తరం), Smart Keyboard సపోర్ట్ ఉంటుంది (వీటిని వేరుగా కొనాలి). Huawei MatePad 11.5 (2026) ఫీథర్ స్యాండ్ పర్పుల్, ఫ్రోస్ట్ సిల్వర్, ఐలాండ్ బ్లూ, డీప్ స్పేస్ గ్రే రంగుల్లో అందుబాటులో ఉంది. స్టాండర్డ్ వేరియంట్ (8GB + 128GB) 1,799 యువాన్ (రూ. 22,915) ధరలు మొదలయ్యాయి. ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అమ్మకాలు డిసెంబర్ 25, 2025 నుంచి హువాయే మాల్, అధికారిక ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంలు, హువాయే ఎక్స్పీరియన్స్ స్టోర్స్ మరియు అథారైజ్డ్ రిటైలర్లలో ప్రారంభం కానున్నాయి.

Exit mobile version