బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన లేటెస్ట్ మూవీ ఫైటర్.. రిపబ్లిక్ డే కానుకగా రిలీజ్ అయిన ఫైటర్ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. దేశభక్తి ప్రధానంగా తెరకెక్కిన ఈ యాక్షన్ మూవీ ఆరు రోజుల్లో 215 కోట్ల కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.ఫైటర్ మూవీలో హృతిక్‌రోషన్ సరసన స్టార్ హీరోయిన్ దీపికా పడుకోణ్ హీరోయిన్ గా నటించింది . ఫస్ట్ టైమ్ దీపికా, హృతిక్ సరసన నటించింది. ఎయిర్‌ఫోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో దాదాపు 275 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు. ఫైటర్ మూవీలో సంషేర్ పఠానియా అనే వైమానిక దళం స్క్వాడ్రాన్ లీడర్‌గా హృతిక్ రోషన్ యాక్టింగ్ మరియు అతడిపై షూట్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.హృతిక్, దీపికా పడుకోణ్ కెమిస్ట్రీ కూడా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.ఈ మూవీలో అనిల్ కపూర్ మరియు కరణ్ సింగ్ గ్రోవర్ కీలక పాత్రలు పోషించారు.
ఇదిలా ఉంటే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సైనట్లు బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. హోళీ పండుగ సందర్భంగా మార్చి చివరి వారంలో ఫైటర్ ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రాబోతున్నట్లు సమాచారం.ఫైటర్ మూవీ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ రికార్డ్ ధరకు దక్కించుకున్నది. దాదాపు 75 కోట్లకు హృతిక్ రోషన్ మూవీ డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. థియేటర్లలో కేవలం హిందీ వెర్షన్ మాత్రమే రిలీజైంది. ఓటీటీలో మాత్రం హిందీతో పాటు దక్షిణాది భాషల్లో ఫైటర్ మూవీని స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు సమాచారం. మార్చి 29న ఫైటర్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజయ్యే అవకాశం ఉన్నట్లు హిందీ సినీ వర్గాల నుంచి సమాచారం.ఫైటర్ మూవీ తర్వాత హృతిక్ రోషన్ వార్ 2 మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమాలో హృతిక్ రోషన్‌తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో నటించనున్నారు.