Site icon NTV Telugu

Hrithik Roshan: హృతిక్ రోషన్‌కి ఏమైంది? వాకింగ్ స్టిక్ వీడియో వైరల్!

Hrithik Roshan

Hrithik Roshan

Hrithik Roshan: బాలీవుడ్ సూపర్‌హీరో హృతిక్ రోషన్ తన అద్భుతమైన ఫిట్‌నెస్‌, మస్కులర్ బాడీకి ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. కోట్లాది మంది అభిమానులు తమ ఫిట్‌నెస్ ఐడల్‌గా భావిస్తారు. అయితే తాజాగా అతడికి సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. “హృతిక్‌కు ఏమైంది?” అన్న ప్రశ్న సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ముంబైలో హృతిక్ రోషన్‌ను వాకింగ్ స్టిక్ సహాయంతో నడుస్తూ కెమెరాకు చిక్కాడు. ఆ వీడియో క్షణాల్లోనే వైరల్ అయింది. ఎప్పుడూ నవ్వుతూ పాపరాజీలకు పోజులిచ్చే హృతిక్ ఈసారి మాత్రం ఎలాంటి మాటలు లేకుండా నేరుగా తన కార్ వైపు వెళ్లిపోయారు. వీడియోలో హృతిక్ నడక, బాడీ లాంగ్వేజ్ చూస్తే కాళ్లకు, ముఖ్యంగా మోకాళ్లకు గాయం అయినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవలే హృతిక్ తన 52వ పుట్టినరోజు జరుపుకొన్నారు. కానీ అతడి ఫిట్‌నెస్ చూస్తే వయసు అంచనా వేయడం కష్టమే. కఠినమైన డైట్, రెగ్యులర్ జిమ్ వర్కౌట్స్‌తో ఎప్పుడూ ఫిట్‌గా ఉండే హృతిక్, సినిమాల్లోనూ ఎక్కువగా యాక్షన్ సీన్స్‌ను తానే చేయడం ఇష్టపడతారు. అయితే ఈసారి ఎలా గాయమైంది అన్న విషయంపై ఇప్పటివరకు అధికారిక అప్‌డేట్ రాలేదు. అభిమానులు మాత్రం త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.

READ MORE: Tollywood : ‘ప్రబల తీర్థం’ నేపథ్యంతో శ్రీకాంత్ అడ్డాల కొత్త సినిమా

Exit mobile version