NTV Telugu Site icon

Hrithik Roshan : హృతిక్ రోషన్ కు గాయాలు.. నిరాశలో ఎన్టీఆర్ ఫ్యాన్స్..

Hruthik

Hruthik

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ పేరు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. బాలీవుడ్ తో పాటు తెలుగులో కూడా సినిమా చేస్తున్నాడు.. ఆయన ఇటీవల గాయపడిన సంగతి తెలిసిందే..ఆ విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియాలో తెలిపారు. ఈ మేరకు ఓ ఫొటోను షేర్ చేశారు. ఆ ఫొటోలో ఆయన నడుముకి బెల్ట్ పెట్టుకుని క్రచస్ సపోర్టుతో నిల్చోని కనిపించారు… ఆ ఫోటోలు ఎంతగా వైరల్ అయ్యాయో మనం చూసాము..

అయితే ఇది షూటింగ్ లో యాక్షన్ సీక్వెన్స్ ల వల్ల జరిగిందా.. లేదా ఏదైనా యాక్సిడెంట్ వల్ల జరిగిందా అనేది క్లారిటీ ఇవ్వలేదు. అసలు హృతిక్ కి ఏమైంది అనేది క్లారిటీ ఇవ్వలేదు. కానీ తాను ఇప్పుడు వీల్ చైర్స్ లో కూర్చోవాల్సి వస్తుంది అని, క్రచెస్ పట్టుకొని నడవాలని తెలిపాడు.. అందరికి కొన్ని సమయాల్లో ఇలాంటి పరిస్థితులు వస్తుంటాయి.. వాటిని దైర్యంగా ఎదుర్కొని త్వరగా కోలుకోవాలని హృతిక్ పోస్ట్ లో పేర్కొన్నాడు..

హృతిక్ రోషన్ ని అలా చూడటంతో అభిమానులు అంతా కంగారుపడుతున్నారు. ఏమైంది, త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. స్టార్ హీరోలు, హీరోయిన్స్ సైతం హృతిక్ పోస్ట్ కింద త్వరగా కోలుకోవాలని మెసేజ్ చేస్తున్నారు. అయితే హృతిక్ కి ఇలా అవ్వడంతో ఎన్టీఆర్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఎన్టీఆర్- హృతిక్ కలిసి త్వరలో వార్ 2 షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది.. అయితే అతను కోలుకొనే వరకు షూటింగ్ లో పాల్గొన లేడు.. షూటింగ్ వాయిదా పడుతుందని తెలుస్తుంది.. మరి దీనిపై హృతిక్ రోషన్ ఏం అప్డేట్ ఇస్తాడో చూడాలి..

Show comments