NTV Telugu Site icon

Viswambhara : ‘విశ్వంభర’లో మెగాస్టార్ పాత్ర ఎలా ఉంటుందంటే..?

Megastar

Megastar

Viswambhara : మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “విశ్వంభర”..ఈ సినిమాను బింబిసార ఫేమ్ వశిష్ఠ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమా నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన కాన్సెప్ట్ వీడియో ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది.విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే మరో కీలక పాత్రలో ఖుష్బూ నటిస్తున్నట్లు ఓ వార్త వైరల్ అయింది.ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.దీనితో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి.

Read Also :Prabhas : ‘బుజ్జి’ పేరు చిన్నగా వున్నా.. మా సినిమాకి ఎంతో స్పెషల్..

అయితే ఈసినిమాలో చిరంజీవి పాత్ర అద్భుతంగా ఉంటుందని సమాచారం.ఈ సినిమాలో మెగాస్టార్ భూమిపై పుట్టిన కారణజన్ముడి పాత్రలో కనిపించనున్నాడు.విశ్వంభర సినిమాతో దర్శకుడు వశిష్ఠ ఓ ప్రత్యేక లోకాన్ని సృష్టిస్తున్నాడు.ప్రేక్షకుడు ఆశ్చర్యపోయేలా అదిరిపోయే విజువల్స్ తో ఈ సినిమాను మేకర్స్ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది.ఈ సినిమా షూటింగ్ జులై నెల కల్లా పూర్తి చేసి ఈ సినిమా సీజీ, వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ కోసం మరింత సమయం తీసుకోని అద్భుతమైన క్వాలిటీ విజువల్స్ ప్రేక్షకులకు అందించనున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమాను మేకర్స్ 2025 జనవరి 10న, సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.

Show comments