Virat Kohli: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఘనతల గురించి ఎంత చెప్పినా తక్కువే. అనామక ఆటగాడి స్థాయి నుంచి వరల్డ్ క్రికెట్‌ను శాసించే రారాజుగా ఎదిగాడు. కోహ్లీ ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. రికార్డుల మీద రికార్డుల బద్దలుకొడుతూ గ్రేటెస్ట్ క్రికెటర్ రేంజ్‌కు చేరుకున్నాడు. ఇవాళ 37వ ఏడాదిలోకి అడుగుపెట్టిన ఈ స్టార్ బ్యాటర్‌కు “కింగ్ కోహ్లీ” అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం..
READ MORE: Students Carry Tent Equipment: విద్యార్థులతో టెంట్ సామాన్లు మోయించిన టీచర్లు.. పేరెంట్స్ ఆగ్రహం..
ఈ పేరు మ్యాచ్ లేదా సిరీస్ నుంచి వచ్చింది కాదు.. ఓ యుగానికి చిహ్నం. విరాట్ కృషి అంతా ఇంతా కాదు.. మ్యాచ్ గెలవాలని పరితపించేవాడు. జట్టు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తెరపై మొదట కనిపించేది విరాట్ ముఖమే. 2014 ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా.. మెల్‌బోర్న్‌కు చెందిన భారతీయ ఐటీ ప్రొఫెషనల్ కునాల్ గాంధీ విరాట్‌కు “కింగ్ కోహ్లీ” అని రాసిన జెర్సీని బహుమతిగా ఇచ్చాడు. ఈ జర్సీపై నేను ‘కోహ్లీ’ అని మాత్రమే రాయాలనుకోలేదు. దానికి కింగ్ యాడ్ చేశాను. అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు కాబట్టి ‘కింగ్’ అనే పదం సహజంగానే వచ్చిందని అతడు వెల్లడించారు. దీంతో అప్పటి నుంచి విరాట్‌ను అభిమానులు కింగ్ కోహ్లీగా సంబోధిస్తున్నారు.
READ MORE: New York Mayor Elections: ట్రంప్‌కు భారీ షాక్.. న్యూయార్క్ మేయర్‌గా మమ్దానీ విజయం
అంతే కాదు.. విరాట్ కోహ్లి.. క్రికెట్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. టీమిండియా రన్ మెషిన్, చేజింగ్ మాస్టర్, కింగ్ కోహ్లి.. ఇలా ఎన్ని పేర్లు పెట్టి పిలుచుకున్నా అతనిపై ఉన్న అభిమానం ఇసుమంతైనా తగ్గదు. కొండలు కరుగుతాయన్న మాట నిజమో లేదో తెలియదు కానీ.. కోహ్లి లాంటి శిఖరం మాత్రం ఎన్నటికి కరగడు. వయస్సు పెరిగేకొద్ది తన ఆటలో మరింత పదును పెంచుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఏడాది క్రితం తనని విమర్శించిన నోళ్లే ఇవాళ మెచ్చుకుంటున్నాయి.
