NTV Telugu Site icon

Exchange Notes: మీతో ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు మార్చుకోలేకున్నారా.. అయితే ఇలా చేయండి..

Exchange Torn Notes

Exchange Torn Notes

ఎవరితోనైనా చినిగిపోయిన లేక పాడైపోయినా కానీ నోట్లోనూ మార్చుకోవడం అంటే చాలా కష్టమైన పని. కాకపోతే వీటిని బ్యాంకుల్లో సులువుగా మార్చుకోవచ్చు. అయితే ఇలా మార్చుకోవడానికి సరైన విధానం తెలిసి ఉండాలి. లేకపోతే నష్టపోతారు. ఇలా చిరిగిపోయిన నోట్లోను బ్యాంకులో తీసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని నియమ నిబంధనలను పెట్టింది. అదేంటో ఒకసారి చూద్దామా..

Fish prasadam: చేప ప్రసాదం పంపిణీలో విషాదం.. క్యూ లైన్‌ లో నిలబడ్డ వ్యక్తి మృతి..

తడిచిన నోట్లు లేదా రెండు ముక్కలుగా చిరిగినా నోట్లు బ్యాంకుల్లో మార్చుకోవచ్చు. ఏవైనా ప్రభుత్వ బకాయిలు చెల్లించేందుకు లేకపోతే పబ్లిక్ అకౌంట్స్ కు క్రెడిట్ చేసుకునేందుకు ఆర్బిఐ ఈ సదుపాయాన్ని బ్యాంకులకు కల్పించింది. బ్యాంకులు కూడా వీటిని రిజెక్ట్ చేసేందుకు అవకాశం లేదు. ఇక రెండు లేదా అంతకంటే ఎక్కువగా ముక్కలైన మ్యుటిలేటెడ్ నోట్లని కూడా బ్యాంకులో మార్చుకోవచ్చు.

Ramoji Rao: బతికి ఉండగానే స్మారకం.. ఎప్పుడైనా చనిపోతే నా సమాధి ఉంది చూద్దురు అనేవారు!

ఇక బాగా పెలుసుగా ఉన్న నోట్లు అలాగే కాలిపోయినవి., ఇంకా హ్యాండిల్ చేయలేని పరిస్థితి చేరిన నోట్లను సాధారణ బ్యాంకు బ్రాంచ్ లో మార్పిడి చేసుకోలేము. ఇటువంటి వాటిని కేవలం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇష్యు కార్యాలయానికి సమర్పించాల్సి ఉంటుంది. అక్కడ మాత్రమే వాటిని పరిశీలించి ఓ ప్రత్యేకమైన విధానంలో మీకు డబ్బులు తిరిగి ఇస్తారు. ఈ విధంగా మొత్తానికి ఒక్కరోజులో కేవలం 20 నోట్లను లేదా ఐదువేల రూపాయలు గరిష్టంగా విలువైన నోట్లను మాత్రమే బ్యాంకులో ఉచితంగా మార్చుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ అంటే బ్యాంకు చెప్పే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.