Delete Autopay: ఆటోపే ఆప్షన్ పెట్టి మర్చిపోయారా..? అయితే సింపుల్‌గా ఒకే దగ్గర క్యాన్సిల్ చేసుకోండిలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిజిటల్ యుగంలో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లతో పాటు రకరకాల మ్యూజిక్, ఎడ్యుకేషన్ యాప్స్ వినియోగదారులను ఆకర్షించడానికి సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నాయి. అందులో భాగమే ‘ఫ్రీ ట్రయల్ ఆఫర్లు’. ‘మొదటి నెల రోజులు ఉచితంగా వాడుకోండి.. ఆ తర్వాతే పేమెంట్ చేయండి’ అంటూ కంపెనీలు ఇచ్చే ఆఫర్లకు చాలామంది ఆకర్షితులవుతుంటారు. ఎలాగూ ఉచితమే కదా అని సబ్‌స్క్రైబ్ చేసుకుంటారు. అయితే.. ఈ ఉచిత సేవలను పొందే క్రమంలోనే మనం బ్యాంక్ ఖాతా లేదా క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా ఆటోపే (AutoPay) మ్యాండేట్‌కు అనుమతి ఇస్తామనే విషయం చాలామంది గమనించరు.
నిజానికి ఆ ప్రీమియం సేవలు అవసరమైన వారికి ఈ ఫ్రీ ట్రయల్ ఒక మంచి అవకాశమే. కానీ.. ఎంతోమంది ఉచిత గడువు ముగిసిన తర్వాత ఆ సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేయడం పూర్తిగా మర్చిపోతుంటారు. ఇలాంటి సందర్భాల్లో గడువు ముగిసిన మరుసటి క్షణమే సదరు యాప్‌లు మీ ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా డబ్బులను డెబిట్ చేసుకుంటాయి.
Also Read
- Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
- Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
- 5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
ఆటోపే ఫెయిల్ అయితే జరిగే నష్టాలు..
ఒకవేళ గడువు ముగిసే సమయానికి మీ బ్యాంక్ ఖాతాలో తగినంత డబ్బు లేకపోతే, సదరు యాప్స్ ఆటోమేటిక్‌గా డబ్బులు డ్రా చేయడానికి ప్రయత్నిస్తాయి. ఆ సమయంలో ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతుంది. ఇలా ఆటోపే ఫెయిల్ అయినప్పుడు బ్యాంకులు భారీగా పెనాల్టీలు లేదా ఫైన్లు విధిస్తాయి. ఇది ఆర్థిక నష్టంతోనే ఆగదు.. వరుసగా ఆటోపేలు ఫెయిల్ అవ్వడం వల్ల మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. దీనివల్ల భవిష్యత్తులో మీరు బ్యాంకుల నుంచి రుణాలు పొందడం కష్టతరంగా మారుతుంది.
NPCI సరికొత్త పరిష్కారం..
ఈ తరహా సమస్యలకు చెక్ పెట్టేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఒక అద్భుతమైన వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా ఏ యాప్‌లో ఆటోపే పెట్టామో గుర్తుంచుకోవడం, ప్రతి యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి వెతకడం కష్టమైన పని. కానీ. ఇప్పుడు https://upihelp.npci.org.in పోర్టల్ ద్వారా అన్ని వివరాలను ఒకే చోట తెలుసుకోవచ్చు.
ఆటోపే మ్యాండేట్‌లను రద్దు చేసే విధానం..
స్టెప్ 1: మొదట మీ మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా అధికారిక వెబ్సైట్ [https://upihelp.npci.org.in](https://upihelp.npci.org.in) ను సందర్శించండి.
స్టెప్ 2: మీ బ్యాంక్ ఖాతా లేదా యూపీఐ (UPI) కి లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
స్టెప్ 3: మీ నంబర్‌కు వచ్చే ఓటీపీ (OTP) ని ఎంటర్ చేసి చేయండి.
స్టెప్ 4: లాగిన్ అయిన తర్వాత, మీ నంబర్‌పై ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న అన్ని ఆటోపే మ్యాండేట్ల జాబితా స్క్రీన్‌పై కనిపిస్తుంది.
స్టెప్ 5: అందులో మీకు అవసరం లేని లేదా మీరు మర్చిపోయిన యాప్‌ల సబ్స్క్రిప్షన్లను గుర్తించి, అక్కడికక్కడే వాటిని సులభంగా రద్దు (Cancel/Revoke) చేసుకోవచ్చు.
ఈ డిజిటల్ కాలంలో అనవసరపు ఖర్చులను అరికట్టడానికి, బ్యాంక్ పెనాల్టీల నుంచి తప్పించుకోవడానికి ప్రతి ఒక్కరూ తమ ఆటోపే హిస్టరీని క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవడం ఎంతో ముఖ్యం.
తాజావార్తలు
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
ట్రెండింగ్
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!