NTV Telugu Site icon

Afternoon Sleeping Tips : మధ్యాహ్నం ఎంత సేపు నిద్ర పోవాలి..?

Sleep10

Sleep10

మనందరికీ నిద్ర చాలా ముఖ్యం. రోజంతా పనిచేసి అలసిపోయి ఓ కునుకు వేస్తే ఎంతో హాయిగా ఉంటుంది. ఆ రోజు నిద్ర లేకపోతే ఆరోజు మొత్తం గందరగోళంగా ఉంటుంది. ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతోంది. నిద్ర సరిగా లేకుంటే ఎన్నో సమస్యల వస్తాయి. కాని మనలో కొందరికి మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు ఉంటుంది. కానీ ఎంతసేపు పడుకోవాలి, ఎప్పుడు లేవాలి అని మాత్రం చాలా మందికి తెలియదు. సరిగ్గా నిద్ర పట్టకపోతే అది కూడా ఓ రోగంగా పరిగణిస్తారు. నిద్రలేమి అనేది ఒక వ్యాధి. అయితే నిద్ర సరిగా పట్టకపోవడానికి రకరకాల కారణాలున్నాయి. నిద్ర సరిగ్గా లేకుంటే మన జీవనశైలిపై దెబ్బపడుతుంది. చాలా మంది మధ్యాహ్న భోజనం తర్వాత కొంత సేపు నిద్రపోతారు. అంటే 15 నిమిషాల నుంచి గంట వరకు కూడా నిద్రిస్తారు. ఇది కొందరి దినచర్యగా మారుతోంది. అయితే ఇలా మధ్యాహ్నం పూట పడుకోవడం ఆరోగ్య పరంగా మంచిదే అయినా అది అందరికీ మంచి పద్ధతి కాదు.

READ MORE: Fruit Juice: ఖాళీ కడుపుతో జ్యూస్ తాగుతున్నారా.. మూల్యం చెల్లించుకోవాల్సిందే!

మధ్యాహ్నం ఎవరు నిద్రపోకూడదు? మీరు ఎంతసేపు నిద్రించాలి? దీని వల్ల కలిగే లాభాలు, నష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మధ్యాహ్నం రెండు గంటలకు ముందే భోజనం ముగించాలని నిపుణులు చెబతుంటారు. ఎందుకంటే ఆలస్యంగా తినడం, ఆలస్యంగా నిద్రపోవడం, ఆలస్యంగా మేల్కొనడం రాత్రి నిద్రపై ప్రభావం చూపుతాయి. మీరు ఒకవేళ మధ్యాహ్నం నిద్రపోతే 4 గంటలకు లేవాలి. ఈ నిద్ర 15 నుండి 20 నిమిషాలలోపు మాత్రమే ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ సేపు నిద్రపోతే పనిమీద ఆసక్తి ఉండదు. అలాగే రాత్రికి నిద్ర రాదు. మధ్యాహ్నం పడుకున్న వెంటనే నిద్ర లేచినట్లయితే, మళ్లీ నిద్రించడానికి ప్రయత్నించవద్దు. ఎందుకంటే శరీరానికి ఎంత విశ్రాంతి అవసరమో, ఎంత నిద్ర అవసరమో శరీరం నిర్ణయిస్తుంది.
మధ్యాహ్నం లేదా రాత్రి పడుకునే ముందు అలారం పెట్టుకోవాలి. అప్పుడే అనుకున్న సమయానికి లేవగలుగుతాం. ఇలా వారం రోజులు చేశాక.. తర్వాత తప్పకుండా ఆసమయానికి మెలుకు వస్తోంది.