NTV Telugu Site icon

Bigg boss 6: కెప్టెన్సీ ఓటింగ్… మీమాంసలో ఆ ఇద్దరూ!

New Project (3)

New Project (3)

Bigg boss 6: బిగ్ బాస్ సీజన్ 6 లో హౌస్ ఆరవ కెప్టెన్ గా ఆర్జే సూర్య ఎంపికయ్యాడు. లాస్ట్ వీక్ త్రుటిలో తప్పిపోయిన ఈ ఛాన్స్ ఇప్పుడు సూర్యకు దక్కడం హౌస్ లోని అందరికీ ఆనందాన్ని కలిగించింది. ఎంతగా అంటే… తొమ్మిది మంది సూర్య కెప్టెన్ కావాలని కోరుకోగా, ఇద్దరు మాత్రమే రోహిత్ కు ఓటు వేశారు. ఈ వారంలో బ్యాటరీ రీఛార్జ్ ద్వారా ఇంటి సభ్యులతో బిగ్ బాస్ సెంటిమెంట్ ఆట ఆడాడు. బ్యాటరీ ఛార్జ్ ను తగ్గిస్తూ, పెంచుతూ, ఇంటిలోని వారికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో వీడియో కాల్, ఆడియో కాల్ లేదంటే ఏదైనా గుర్తుగా ఫోటో లాంటివి అందించే ప్రయత్నం చేసి వాళ్ళందరినీ ఓ రకంగా రీఛార్జ్ చేశాడు. దాంతో ఈసారి కెప్టెన్సీ టాస్క్ లో పాల్గొనే ఛాన్స్ అందరికీ ఇచ్చాడు.

Read Also: Munugode bypoll: మునుగోడులో గుర్రంపై వచ్చి నామినేషన్

ఆ తర్వాత రెండు టాస్కులు పెట్టగా, చివరిలో ఆర్జే సూర్య, రోహిత్ ఫైనల్స్ లో నిలిచారు. వీరిద్దరిలో మెజారిటీ ఇంటి సభ్యులు సూర్య పక్షాన నిలవడంతో అతనే కెప్టెన్ అయ్యాడు. చిత్రం ఏమంటే… రోహిత్ భార్య మెరీనా సైతం తన ఓటును సూర్యకే వేసింది. తన సోదరుడికి వేయాలో, భర్తకు వేయాలో తేల్చుకోలేకపోతున్నానని చెప్పిన మెరీనా ఆట తీరు దృష్ట్యా తాను సూర్య కే ఓటు వేస్తున్నట్టు పేర్కొంది. ఇదే మీమాంసకు ఇనయా కూడా గురైంది. ఆమె వంతు వచ్చినప్పుడు ఒక వైపు బావ (సూర్య) మరోవైపు బ్రదర్ (రోహిత్) ఉన్నారని, అయితే తన ఓటు బావకే నని తేల్చేసింది. ఇంతమంది ఇంటి సభ్యులు సూర్య మీద పెట్టుకున్న ఆశలను కెప్టెన్ గా అతను ఎలా నెరవేర్చుతాడో చూడాలి.

Show comments