Site icon NTV Telugu

TheRajaSaab : అఫీషియల్ రాజాసాబ్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసిన హాట్ స్టార్

The Rajasaab

The Rajasaab

మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన ‘ది రాజా సాబ్’ బాక్సాఫీస్ వద్ద ఆశించినంత హిట్ కాలేదు. ట్రైలర్ లో చూపించిన ఓల్డ్ గెటప్ లుక్ థియేటర్లలో మిస్ అవడంతో ఫ్యాన్స్ ఓ రేంజ్ లో దర్శకుడు మారుతినుద్దేశిస్తూ ట్రోలింగ్ చేసారు. తొలి రోజు భారీ ఓపెనింగ్ రాబట్టిన రాజాసాబ్ ఫైనల్ రన్ లో ప్లాప్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా థియేట్రికల్ రన్ క్లోజ్ అయినట్టే. దీంతో థియేటర్‌కి వెళ్లలేకపోయిన వారు ఓటిటి రాజాసాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు. కాగా ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ వేదికపై సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్ ఫిబ్రవరి 6 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

Also Read : Varanasi : వారణాసి.. వరల్డ్ లోనే 5వ సినిమా.. ఇండియాలో నెం.1.

ఈ పాన్ ఇండియా  చిత్రాన్ని కేవలం తెలుగుతో పాటు సౌత్ ఇండియాలోని నాలుగు ప్రధాన భాషలైన తెలుగు, కన్నడ, తమిళం, మరియు మలయాళం ఆడియో లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ చేస్తున్నాట్టు ప్రకటించింది. హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ పై క్లారిటీ రావాల్సి ఉంది. వాస్తవానికి సంక్రాంతికి అనేక సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయ్యయి. కానీ ఆ సినిమాలు ఏవి కూడా ఓటీటీలోకి  రాలేదు. కానీ ‘ది రాజా సాబ్’ చిత్రం కేవలం 28 రోజుల థియేట్రికల్ రన్ తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లోకి వస్తుండటం గమనార్హం. థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోపే ప్రభాస్ సందడి మళ్ళీ మొబైల్స్ మరియు టీవీల్లో మొదలుకానుంది.  అయితే థియేటర్లలో మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, ఓటీటీ ద్వారా ‘రాజా సాబ్’కు మంచి రెస్పాన్స్ వ‌స్తుంద‌ని అభిమానులు ఆశిస్తున్నారు.

Exit mobile version