Site icon NTV Telugu

Urvashi Rautela : ప్రెసోథెరపీ చేయించుకున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ…

Whatsapp Image 2023 12 19 At 1.25.46 Pm

Whatsapp Image 2023 12 19 At 1.25.46 Pm

బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌటెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ భామ హీరోయిన్ గా కంటే ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ తో బాగా పాపులర్ అయింది. తెలుగులో కూడా ఈ భామ వరుసగా స్పెషల్ సాంగ్స్ చేస్తూ దూసుకుపోతుంది. ఈ ఏడాది మెగా స్టార్ చిరంజీవి సరసన వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ సాంగ్ లో మెరిసింది. ఆ పాట సూపర్ హిట్ కావడంతో ఈ భామకు వరుసగా స్పెషల్ సాంగ్స్ ఆఫర్స్ వచ్చాయి.చివరిగా ఈ భామ తెలుగులో రామ్ నటించిన స్కంద మూవీలో ‘కల్ట్ మామ’ అనే స్పెషల్ సాంగ్ చేసింది. ఈ పాటకు కూడా మంచి రెస్పాన్స్ లభించింది. ఇదిలా ఉంటే ఊర్వశి రౌటెల తాజాగా ప్రెసోథెరపీ చేయించుకుంది.గుండెకి ఈసీజీ తీసే స‌మ‌యంలో డాక్ట‌ర్లు పేషెంట్ ని బెడ్ మీద నిటారుగా పడుకోబెట్టి ఈసీజీ తాలుకా వైర్లు అన్ని శ‌రీరానికి అతికించి..వాటిని మోనిట‌ర్ కి ఎలా క‌నెక్ట్ చేస్తారో తెలిసిందే కదా..గుండె స‌క్ర‌మంగా ప‌నిచేస్తుందా లేదా..అని తెలుసుకోవ‌డం కోసం ఈ ప‌రీక్ష చేస్తుంటారు. అందులో రిపోర్ట్ ని బ‌ట్టి గుండె ఎలా ప‌నిచేస్తుంది.. అన్న‌ది డాక్టర్లు నిర్దారిస్తారు.

తాజాగా హాట్ బ్యూటీ ఊర్వ‌శి రౌతేలా కూడా అలాంటి ప‌రీక్షే చేయించుకున్న‌ట్లు తెలుస్తుంది.కాక‌పోతే ఇది గుండెకి సంబంధించిన పరీక్ష కాదు. ఇదో ర‌క‌మైన థెర‌పీ అని తెలుస్తుంది. ఊర్వ‌శి ని ఇలా పెషెంట్ లా సిద్ధం చేసి ఆమె కాళ్ల‌కు,న‌డుం భాగాలకు ఏవో వైర్లు త‌గిలించారు. వాటిని మోనిట‌ర్ కి క‌నెక్ట్ చేసారు. దీనినే ప్రెస్సోథెరపీ అంటారట. అంటే శరీరం మొత్తాన్ని నిర్విషీకరణ చేస్తుంది.శరీరం యొక్క శోషరస వ్యవస్థను ప్రేరేపిస్తుంది. త‌ర్వాత శ‌రీరంలో టాక్సిన్స్ ను కూడా తొలగిస్తారు.ఈ థెర‌పీ ద్వారా బలమైన రోగనిరోధక వ్యవస్థ అభివృద్దిలోకి వ‌స్తుందని తెలుస్తుంది.అయితే ఊర్వశి ఇమ్యునిటీ ప‌వ‌ర్ బాగా త‌గ్గింది అనుకుంటా అందుకే ఈ భామ ఇలాంటి థెర‌పీల జోలికి వెళ్లినట్లుంది.. ప్ర‌స్తుతం ఈ భామ థెరపీ తీసుకుంటున్న ఫోటోస్ నెట్టింట బాగా వైర‌ల్ అవుతున్నాయి.ఈ ఫొటోస్ చూసిన అభిమానులు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు..మొదట ఈ ఫోటో చూసిన నెటిజన్స్ వెంట‌నే ఊర్వ‌శి గుండెకి ఈసీజీ తీయించుకుంటుంద‌ని అనుకున్నారు.కానీ ఆ త‌ర్వాత అది ఈసీజీ కాదు థెర‌పీ అని క్లారిటీ వ‌చ్చింది

Exit mobile version