ఉత్తరప్రదేశ్‌లోని మధురలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మధురలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై 40 మందితో ప్రయాణిస్తున్న బస్సును కారు ఢీకొట్టడంతో ఐదుగురు సజీవదహనం అయ్యారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోవాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సీఎం యోగి సంతాపం తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేందుకు తక్షణమే ఏర్పాట్లు చేయాలన్నారు.
Read Also: Kelvin Kiptum Dies: ఘోర రోడ్డు ప్రమాదం.. మారథాన్ అథ్లెట్ కెల్విన్ కిప్టుమ్ మృతి!
ఇక, మధురలోని మహావన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మైల్ స్టోన్ 116 దగ్గర జరిగిన ఈ ఘోర ప్రమాదం జరిగింది. అయితే, కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు మరణించగా.. బస్సులో ఒకరు మరణించినట్లు పోలీసులు తెలిపారు. కాగా, బస్సు బీహార్ నుంచి ఢిల్లీ వైపు వెళుతోంది.. బస్సులో ఉన్న మిగతా వారందరు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.