Site icon NTV Telugu

Lucknow: పాపం.. చికెన్ ఇవ్వలేదని ఓ వ్యక్తిని చితక్కొట్టారు

Chiken

Chiken

చికెన్ కర్రీ అంటే లొట్టలేసుకుని తినే వారు చాలా మందే ఉన్నారు. ఇక ముఖ్యంగా ఏవైనా పండగలప్పుడు కంచంలో కోడి ముక్క లేనిది ముద్ద దిగదు. చికెన్ అంటే ఇష్టపడే వాళ్లు చాాలా మంది ఉన్నారు. అయితే తాజాగా చికెన్ ఇవ్వలేదని ఓ వ్యక్తిపై కొందరు యువకులు దాడి చేశారు. ఈ దాడి ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Read Also: Manipur: మణిపూర్‌ అల్లర్లు.. మరో 9 కేసులు విచారించనున్న సీబీఐ

వివరాల్లోకి వెళ్తే.. చికెన్ ఉచితంగా ఇవ్వలేదని ఓ దళిత వ్యక్తిపై దాడికి పాల్పడ్డ.. ఈ అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. సుజన్ అహిర్‌వార్ అనే వ్యక్తి బైక్‌పై చికెన్‌ను అమ్ముతుంటాడు. అయితే ఒక ఊరి నుంచి మరో ఊరిలోకి వెళ్లే క్రమంలో మార్గమధ్యలో కొందరు నిందితులు అతన్ని అడ్డుకొని.. చికెన్ ఇవ్వమని అడిగారు. దానికి అతను డబ్బులు ఇస్తేనే.. చికెన్ ఇస్తామనడంతో ఆ వ్యక్తిని కొందరు యువకులు చెప్పులతో చితకబాదారు.

Read Also: Delhi: ఢిల్లీలో భారీ వాహనాలపై ఆంక్షలు

అయితే ఈ ఘటనను ఓ వ్యక్తి ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో తెగ వైరల్ గా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వీడియో ఆధారంగా నిందితుల పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. మరోవైపు ఈ ఘటనపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఓ దళితుడి పట్ల ఇలా చెప్పులతో దాడికి పాల్పడం సరికాదని.. నిందితులను పట్టుకుని కఠిన శిక్ష విధించాలంటూ అక్కడి దళిత సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version