Hong Kong: కరోనా మహమ్మారి వచ్చి మూడేళ్లయింది. ప్రజల జీవితాలతో వైరస్ చెలగాటమాడింది. ఎన్నో ప్రాణాలను బలితీసుకుంది. ఈ మూడేళ్లలో ప్రజల జీవన స్థితిగతుల్లో పెను మార్పులు వచ్చాయి. ముఖానికి మాస్క్ తప్పనిసరైంది. మనిషిని మనిషి చూసే భయపడే స్థితికి చేరుకున్నాం. ఈ క్రమంలోనే కోవిద్ ప్రపంచవ్యాప్తంగా తగ్గుముఖం పట్టడంతో హాంకాంగ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 1 నుండి పౌరులు మాస్క్ ధరించనక్కరలేదని ప్రకటించింది. ‘హాంకాంగ్ సాధారణ స్థితిని తిరిగి ప్రారంభిస్తోందని చూపించడానికి ఇది స్పష్టమైన సందేశం” అని సిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ లీ రాయిటర్స్‌తో అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ మాస్క్ ఆదేశాన్ని కలిగి ఉన్న చివరి నగరాల్లో హాంకాంగ్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు దశలవారీగా మాస్క్ నిబంధనలు తొలగించాయి. హాంకాంగ్ చైనా నిర్దేశించిన నియమాలనే అనుసరిస్తూ వస్తోంది.
Read Also: Delhi Liquor Scam: తమ పదవులకు రాజీనామా చేసిన సిసోడియా, సత్యేంద్ర జైన్
కరోనా దెబ్బకు హాంకాంగ్ టూరిజం కుదేలైంది. తీవ్రమైన కోవిడ్ ఆంక్షలు హాంకాంగ్ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. గ్లోబల్ ఐసోలేషన్ అంటే టూరిజం పరిశ్రమ పూర్తిగా ధ్వంసమైంది. 2022లో ఆసియా ఆర్థిక కేంద్రం ఆర్థిక వ్యవస్థ 3.5 శాతం తగ్గిపోయింది. కోవిడ్ కాలంలో హాంకాంగ్ జనాభా గణనీయంగా తగ్గిపోయింది. హాంకాంగ్ మొత్తం జనాభా ఇప్పుడు 7.3 మిలియన్లకు చేరుకుంది. గతేడాది, 89,200 మంది దేశం విడిచిపెట్టారు. తాజాగా వలసలు పెరుగుతున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి.